Zodiac signs: వామ్మో.. ఈ రాశుల వారికి మహా కోపం..తట్టుకోవడం కష్టమే..!
కోపం ఉన్నంత సేపు మాత్రం చాలా ఆవేశంగా రెచ్చిపోతారు. చేతికి ఏది దొరికితే అది విసిరేస్తారు. తీరా.. చివరకు కోపం తగ్గిన తర్వాత.. ఎందుకు అలా ప్రవర్తించానా అని ఫీలౌతారు.

కోపం ఎక్కువగా ఉండే రాశులు...
ప్రేమ, సంతోషం, దుఃఖం లాగానే కోపం కూడా ఒక ఎమోషన్. సహజంగా కోపం అందరికీ వచ్చేస్తుంది. కానీ, కొందరికి మాత్రం ముక్కు మీదే కోపం ఉంటుంది.చిన్నా, పెద్దా అనే తేడా చూడరు. ఇంట్లో వారి మీదా, బయటి వారి మీద కోపం చూపిస్తూనే ఉంటారు. తమకు నచ్చిని మాట చిన్నది చెప్పినా వీరికి విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది.ఆ కోపంలో ఏం చేస్తారో వారికే తెలీదు. మరి, జోతిష్యశాస్త్రంలో విపరీతమైన కోపం ఉన్న రాశులేంటి...? కోపం చాలా తక్కువ ఉన్న రాశులేంటో చూసేద్దామా...
1.వృశ్చిక రాశి...
జోతిష్యశాస్త్రంలో అన్ని రాశులకంటే వృశ్చిక రాశివారికి కోపం చాలా ఎక్కువ. వీరికి కోపం వచ్చింది అంటే కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. కోపం తెప్పించిన వారిపై పగ పెంచుకుంటారు. వీరికి కోపం ఉన్నంతసేపు ఒక తుఫాను వచ్చినట్లే ఉంటుంది. కనీసం కుటుంబ సభ్యులు కూడా వీరి కోపాన్ని కంట్రోల్ చేయలేరు.
2.మేష రాశి...
మేష రాశివారు సహజంగానే కోపంగా ఉంటారు. వీరికి కోపం వెంటనే వస్తుంది..కానీ ఎక్కువ సేపు కంటిన్యూ అవ్వదు. పాలమీద పొంగులా వెంటనే తగ్గిపోతుంది. కానీ, ఆ కోపం ఉన్నంత సేపు మాత్రం చాలా ఆవేశంగా రెచ్చిపోతారు. చేతికి ఏది దొరికితే అది విసిరేస్తారు. తీరా.. చివరకు కోపం తగ్గిన తర్వాత.. ఎందుకు అలా ప్రవర్తించానా అని ఫీలౌతారు.
3.సింహ రాశి...
సింహ రాశి వారికి గర్వం చాలా ఎక్కువ. ఎవరైనా తమ అహాన్ని దెబ్బ తీస్తే వీరు తట్టుకోలేరు. ఆ సమయంలో వీరికి కోపం చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. అంతేకాదు.. ఏదైనా విషయంలో ఎవరైనా వీరిని రెచ్చగొట్టినప్పుడు కూడా వీరికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కానీ, వీరి కోపం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. కోపం తగ్గిన తర్వాత వీరు చాలా నార్మల్ గా ప్రవర్తిస్తారు.
4.మిథున రాశి...
మిథున రాశివారికి కూడా కోపం చాలా తొందరగా వస్తుంది. సహజంగానే ఈ రాశివారు స్థిరంగా ఉండరు. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తారు. వీరికి కోపం తొందరగానే వస్తుంది. కానీ.. అది చాలా స్వల్పంగా ఉంటుంది. వీరి కోపం కారణంగా ఎలాంటి అనార్థాలు జరగవు. పొరపాటున వీరి కోపం కారణంగా ఏదైనా సమస్య వచ్చినా.. దానిని చాలా తెలివిగా పరిష్కరించగలరు.
5.ధనస్సు రాశి...
5.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారు చాలా ముక్కుసూటిగా ఉంటారు. ఈ రాశివారు తమ జీవితంలో స్వేచ్ఛకు ఎక్కువ విలువ ఇస్తారు.తమ స్వేచ్ఛకు ఎవరైనా ఆటకం కలిగిస్తే.. వారిపై చాలా కోపం చూపిస్తారు. తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి మాత్రమే కోపాన్ని చూపిస్తారు. తర్వాత నార్మల్ అయిపోతారు.
6.వృషభ రాశి...
వృషభ రాశి వారికి మొండి పట్టుదల చాలా ఎక్కువ. వీరు వీలైనంత వరకు శాంతంగా ఉండాలనే అనుకుంటారు. కానీ.. కొందరు చేసే కొన్ని పనులు.. వీరికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా ఎవరైనా రెచ్చగొడితే వీరికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది.