Selfless Zodiac Signs: ఈ 5 రాశుల వారు కర్ణుడి వంశస్థులు, ప్రాణమైనా దానమిస్తారు
Selfless Zodiac Signs: జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు కర్ణుడిలాంటి వ్యక్తిత్వాన్ని, లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి ఇతరులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది. వీరు సాయం చేయాలనుకుంటే ఎంత దూరమైన వెళతారు. ఆ రాశులేవో తెలుసుకోండి.

కన్యా రాశి
కన్యా రాశి వారు కర్ణుడిలాంటి వారు. ఇతరులకు సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తారు. ఇతరులకు సేవ చేసేందుకు ముందుంటారు. వీరిని సేవకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. అవసరంలో ఉన్నవారిని గుర్తించి మరీ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. సాయం చేసి ఎలాంటి ప్రతిఫలం ఆశించరు. కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించిపోతారు. వారికి కేవలం ఓదార్పునివ్వడమే కాకుండా, ఆ సమస్య నుంచి బయటపడే మార్గాన్ని కూడా ఈ రాశి వారు చూపిస్తారు. అందుకే వీరిని దానంలో, స్నేహం చేయడంలో, సాయం చేయడంలో కర్ణుడు అని పిలుచుకోవచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారిని పాలించేది చంద్రుడు. అందుకే వారికి సహజంగానే మాతృ హృదయం ఉంటుంది. ఇతరుల కష్టాలను చూసి తట్టుకోలేరు. ఇతరుల కష్టాలను తమ కష్టాలుగానే భావిస్తారు. ఆకలితో ఉన్నవారిని చూస్తే చలించిపోతారు. ఇతరులను అన్నం పెట్టడంలో, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంలో కర్కాటక రాశి వారిని మించిన వారు లేరు. ఎవరైనా మానసికంగా కుంగిపోతే, బాధపడుతుంటే వెంటనే వారికి అండగా నిలబడి సాయం చేస్తారు. ఎదుటి వారి బాధను లోతుగా అర్థం చేసుకోవడంలో ఈ రాశి వారు ముందుంటారు. కర్కాటక రాశి వారిని స్నేహితులుగా ఉన్నవారు ఎంతో లక్కీ. వీరి నుంచి సులభంగా సాయం అందుకోవచ్చు. స్నేహితుల కష్టంలో వీరే ముందుంటారు.
మీన రాశి
మీన రాశి వారిని పాలించేది బృహస్పతి. అందుకే ఈ గ్రహం వల్ల వీరికి జ్ఞానం, తెలివి, ధర్మ భావన అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ఇతరుల సంతోషం కోసం ఏమైనా చేస్తారు. ఇతరుల సమస్యను తమ సమస్యగానే భావిస్తారు. ఇతరుల కోసం తమ సొంత కోరికలను కూడా త్యాగం చేయడానికి వెనుకాడరు. మూగజీవాల నుంచి మనుషుల వరకు ఎవరికి కష్టం వచ్చినా మీరు ముందుండి సాయం చేస్తారు. అందరి పట్ల దయతో ఉంటారు. తమకు హాని చేసినా కూడా వారికి సాయం చేసేందుకు ముందుంటారు. వీరికి చాలా విశాల హృదయం. వీరి నిస్వార్థం గుణం, కరుణ, క్షమించే గుణం అందరికీ ఎంతో మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి పాలించేది బృహస్పతి. ధనుస్సు రాశి వారు ధర్మ గుణం కలిగిన వారు. వీరు ఇతరులకు డబ్బు సహాయం చేసేందుకు ముందుంటారు. ఎదుటివారి జీవితాన్ని ఆనందంగా మార్చే మంచి సలహాలు, జ్ఞానాన్ని అందించడంలో వీరు ముందుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వీరు చూడలేరు. తమ దగ్గర డబ్బును కూడా ఇచ్చేస్తారు. తమ దగ్గర లేకపోతే ఇతరుల దగ్గర అడిగి మరీ సహాయం చేస్తారు. వీరు ధార్మిక, సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇతరులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేరు. వారికి అండగా నిల్చుంటారు.
కుంభ రాశి
కుంభ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. వారు సమాజంలో ఉండాల్సిన వ్యక్తులు . సమాజానికి సహాయం చేయడానికి వీరు ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరికి కష్టసుఖాలపై అవగాహన అధికంగా ఉంటుంది. వారి అభిప్రాయాలు ప్రకారం ప్రేమతోనే ఈ ప్రపంచం నడుస్తుందని వారు బలంగా నమ్ముతారు. పేద ప్రజలకు సాయం చేసేందుకు వీరు ముందుంటారు. వీరు స్వచ్ఛంద సంస్థలలో చేరి సమాజం కోసం పనిచేస్తారు. తాము పేదరికంలో ఉన్నా సహాయం కోరి వచ్చినా కూడ వెంటనే సాయం చేస్తారు.

