Zodiac signs: అత్యంత తెలివైన రాశులు.. ఐక్యూ చాలా ఎక్కువ..!
Zodiac signs: తెలివితేటలు కొందరికి పుట్టుకతోనే ఉంటాయి. ఎక్కువ తెలివి ఉన్నావారు ఎలాంటి సమస్యను అయినా చాలా సులభంగా పరిష్కరించగలరు. జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు ఈ విషయంలో ముందుంటారు.

Zodiac signs
జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశికీ ఒక ప్ర్యతేక స్వభావం, బలం ఉంటాయి. అయితే, మేథస్సు, ఐక్యూ విషయానికి వస్తే, కొన్ని రాశులవారు ఇతరులకంటే ముందుంటారని జోతిష్య నిపుణులు చెబుతుంటారు. మేథస్సు అనేది కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు.. సమస్యలను పరిష్కరించడం, విశ్లేషించడం, సమయానుకూలంగా స్పందించడం కూడా అందులో భాగమే. మరి, జోతిష్య నిపుణుల ప్రకారం.. ఏ రాశుల వారికి ఐక్యూ, తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం...
1. కుంభ రాశి (Aquarius) - విశ్లేషణాత్మక మేధస్సు
ఈ జాబితాలో కుంభ రాశి అగ్రస్థానంలో ఉంటుంది. వీరికి యురేనస్ గ్రహం అధిపతి. వీరు చాలా వినూత్నంగా ఆలోచిస్తారు. వీరు ఏ విషయాన్నైనా చాలా నిష్పాక్షికంగా, విశ్లేషణాత్మకంగా చూస్తారు. ఒక సమస్య ఎదురైతే అందరూ ఆలోచించే పద్ధతిలో కాకుండా, 'అవుట్ ఆఫ్ ది బాక్స్' ఆలోచించి పరిష్కారం వెతుకుతారు. వీరి తెలివితేటలు భవిష్యత్తును ముందుగానే ఊహించేలా ఉంటాయి.
2. వృశ్చిక రాశి (Scorpio) - గ్రహణ శక్తి , చాకచక్యం
వృశ్చిక రాశి వారు తమ 'పర్సెప్చువల్ ఇంటెలిజెన్స్' (Perceptive Intelligence) కు ప్రసిద్ధి. అంటే, ఇతరులు గమనించలేని సూక్ష్మ విషయాలను కూడా వీరు త్వరగా పసిగట్టగలరు. వీరు చాలా రహస్యంగా ప్లాన్ వేస్తారు. వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎదుటివారి మనసులో ఏముందో వారి కళ్లను చూసి చెప్పగలరు. క్లిష్టమైన సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో వీరి ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటుంది.
3. మిథున రాశి (Gemini) - చురుకైన బుద్ధి, వాక్చాతుర్యం
మిథున రాశికి బుధ గ్రహం అధిపతి. బుధుడు అంటేనే తెలివితేటలకు కారకుడు. వీరు సమాచారాన్ని చాలా వేగంగా ప్రాసెస్ చేస్తారు.వీరు ఏ విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకుంటారు (Quick learners). వీరి భాషా నైపుణ్యం, సమయస్ఫూర్తి అద్భుతంగా ఉంటాయి. ఏకకాలంలో అనేక పనులను చక్కబెట్టగల మేధస్సు వీరి సొంతం.
4. కన్య రాశి (Virgo) - ఆచరణాత్మక తెలివితేటలు
కన్య రాశి వారు పక్కా ప్రణాళికాబద్ధంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరిది లాజికల్ ఇంటెలిజెన్స్. వీరు ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. గణితం, సైన్స్ లేదా డేటా విశ్లేషణ వంటి రంగాల్లో వీరు మేధావులుగా పేరు తెచ్చుకుంటారు. ఎంతటి గందరగోళ పరిస్థితినైనా క్రమపద్ధతిలోకి తీసుకురావడం వీరి ప్రత్యేకత.
5. మకర రాశి (Capricorn) - వ్యూహాత్మక మేథస్సు
మకర రాశి వారు చాలా క్రమశిక్షణతో కూడిన తెలివితేటలను కలిగి ఉంటారు. వీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా కేవలం వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు.దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా చేరుకోవాలో వీరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. వీరిది మెథడికల్ ఇంటెలిజెన్స్. అందుకే వీరు గొప్ప వ్యాపారవేత్తలుగా, రాజకీయ నాయకులుగా రాణిస్తారు.

