Moon Transit: వృశ్చిక రాశిలోకి చంద్రుడు, మూడు రాశులకు డబ్బు సమస్య తీరినట్లే..!
చంద్రుడు తన రాశిని మార్చుకున్నాడు. వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టాడు. దీని వల్ల మూడు రాశుల వారికి చాలా మేలు జరగనుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Moon Transit
జోతిష్యశాస్త్రం ప్రకారం, జూన్ 9వ తేదీన చంద్రుడు వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టాడు. నిన్నటి వరకు తుల రాశి లో ఉన్న చంద్రుడు.. వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టాడు. దీని ప్రభావం మూడు రాశులపై చాలా ఎక్కువగా చూపించనుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా…
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి ఈ వారం కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది. వారి కలలలోని భాగస్వామిని కలుసుకోవచ్చు, ఇది జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఉద్యోగాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్లు లభిస్తాయి. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత బంగారంలో పెట్టుబడి పెట్టాలి. ఆలోచించి పెట్టుబడి పెట్టడం వల్ల వ్యాపారవేత్తలు భారీ లాభాలను పొందుతారు.
వృశ్చిక రాశి..
చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలో కి అడుగుపెట్టాడు. దీని వల్ల వృశ్చిక రాశి వారి కి చాలా మేలు జరగనుంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కోరుకున్న వ్యక్తిని కలిసుకునే అవకాశం ఉంది. వివాహితులు ప్రయాణానికి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కాబట్టి, ఈ వారం కోరుకున్న ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ధార్మిక యాత్ర సమయంలో వృద్ధులకు ఆరోగ్య మద్దతు లభిస్తుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు ఉదయం చంద్ర రాశి మార్పు చాలా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఒక ముఖ్యమైన ఒప్పందం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితంలో నడుస్తున్న సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. పెట్టుబడి విషయంలో దుకాణదారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.