Moon Transit: నక్షత్రం మార్చుకున్న చంద్రుడు, మూడు రాశులకు ధనయోగం..!
చంద్రుడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్నాడు. కాగా.. మకర రాశిలో ఉండగానే తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి మేలు జరగనుంది.

Moon Transit
గ్రహాల అధిపతి మంగళుడిని ధనిష్ట నక్షత్ర అధిపతిగా భావిస్తారు. ఇది ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, శక్తి, సోదరుడికి సంబంధించినది. చంద్రుడు ఈ రోజు ధనిష్ట నక్షత్రంలో కి అడుగుపెట్టాడు. జోతిష్యశాస్త్రంలో చంద్రుడు ఏ రాశి మారినా, ఏ నక్షత్రం మారినా దాని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. మరీ ముఖ్యంగా మూడు రాశులకు ప్రయోజనాలు చాలా ఎక్కువగా జరగనున్నాయి. ఆ మూడు రాశులేంటంటే…
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారిని చంద్రుడికి ఇష్టమైన రాశిగా పరిగణిస్తారు. వీరిపై చంద్ర సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం చంద్రుడు నక్షత్రాన్ని మార్చుకోవడం కర్కాటక రాశివారికి ఊహించని ప్రయోజనాలు కలిగించనుంది. వీరి జీవితంలో ఆనందం పెరుగుతుంది. వ్యాపారస్తుల జాతకంలో ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. ఇంట్లో ప్రశాంతత వాతావరణం, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఆఫర్ లెటర్ వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి..
మకర రాశి వారికి ఈ సమయంలో చంద్ర సంచారం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలగవచ్చు. ధనిష్ఠ నక్షత్రంలోని మొదటి పద్నాలుగు భాగాలు కూడా మకర రాశిలోకి వస్తాయి. ఈ చంద్ర సంచారం మకర రాశి వారిపై రెట్టింపు సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యాపారంలో విజయం సంతోషాన్నిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి జూన్ నెలలో కి బదిలీ అయ్యే అవకాశం ఉంది.
కుంభ రాశి..
ధనిష్ఠ నక్షత్రంలోని మొదటి రెండు భాగాలు మకర రాశిలో, చివరి రెండు భాగాలు కుంభ రాశిలో ఉంటాయి. ఈ సంచారం కుంభ రాశి వారి జీవితంపై కొంతవరకు సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు రావడం మొదలవుతుంది. యువత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. తోబుట్టువులతో సమయం గడపడం వల్ల బంధాలలో అనుబంధం పెరుగుతుంది. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

