Moon-Rahu Conjuction: చంద్రుడు-రాహువు కలయిక.. ఈ రాశుల జీవితంలో ఊహించని మార్పులు..!
జూన్ 16న చంద్రుడు కుంభ రాశిలోకి అడుగుపెడుతున్నాడు. అక్కడే ఉన్న రాహువును కలవనున్నాడు. ఈ కలయిక కారణంగా ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?

రాహు-చంద్రుడి కలయిక
జోతిష్య శాస్త్రంలో చంద్రుడు, రాహువుల కలయిక చాలా ముఖ్యమైనది. ఈ కలయిక జీవితంలో మంచి, చెడులలో చాలా మార్పులు తీసుకురాగలదు. జూన్ 16వ తేదీన మధ్యాహ్నం చంద్రుడు కుంభ రాశిలోకి అడుగుపెడతాడు. ఆల్రెడీ అక్కడ రాహువు ఉండటంతో ఈ కలయిక ఏర్పడుతుంది. ఈ కలయిక కొన్ని రాశుల వారికి మంచి చేస్తే, మరి కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి, ఏ రాశుల వారికి మేలు జరగనుందో తెలుసుకుందాం...
మేష రాశి...
మేష రాశి వారికి ఈ కలయిక 11వ ఇంట్లో ఉంటుంది. ఆదాయం, సామాజిక స్థితికి సంబంధించిన ఇల్లు ఇది. ఆర్థికంగా మంచి సమయం. ఉద్యోగులకు పదోన్నతి, కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, పెట్టుబడుల ద్వారా లాభాలు. స్నేహితులు, అన్నల సహాయం ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
వృషభ రాశి..
వృషభ రాశి వారికి ఈ కలయిక 10వ ఇంట్లో ఉంటుంది. ఉద్యోగం, సామాజిక గౌరవానికి సంబంధించిన ఇల్లు ఇది. కొత్త విజయాలు, పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూలం. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే మంచిది. ఆస్తి కొనడానికి, అమ్మడానికి కూడా మంచి సమయం.
మిథున రాశి..
మిథున రాశి వారికి ఈ కలయిక 9వ ఇంట్లో ఉంటుంది. అదృష్టం, ధర్మం, దూర ప్రయాణాలకు సంబంధించిన ఇల్లు ఇది. ధార్మిక, ఆధ్యాత్మిక ప్రయాణాలు మంచివి. విదేశీ వ్యాపార, ఉద్యోగ అవకాశాలు రావచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యలో విజయం, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయండి.
కన్య రాశి..
కన్య రాశి వారికి ఈ కలయిక 6వ ఇంట్లో ఉంటుంది. ఆరోగ్యం, శత్రువులు, పోటీకి సంబంధించిన ఇల్లు ఇది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో విజయం. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు. రిస్క్ ఉన్న పెట్టుబడులు మానుకోండి. ఒత్తిడి తగ్గించుకోవడానికి దినచర్య సరిగ్గా పాటించండి. వ్యాయామం చేయండి.
ధనస్సు రాశి...
ధనుస్సు రాశి వారికి ఈ కలయిక 3వ ఇంట్లో ఉంటుంది. ధైర్యం, సంభాషణ, చిన్న ప్రయాణాలకు సంబంధించిన ఇల్లు ఇది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కష్టానికి ప్రశంసలు. చిన్న ప్రయాణాలు మంచివి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారస్తులకు లాభాలు, ఉద్యోగస్థులకు పదోన్నతి. సంభాషణా నైపుణ్యం ఉపయోగించండి. కోపం, తొందరపాటు తగ్గించుకోవాలి.