Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారిని ఎవ్వరూ ఇష్టపడరు.. ఎందుకో తెలుసా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో నక్షత్రంలో పుట్టినవారు ఒక్కో స్వభావంతో ఉంటారు. కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారిని ఇతరులు అస్సలు ఇష్టపడరు. వారి మాటలు, స్పందించే విధానం కొందరికి నచ్చకపోవచ్చు. మరి ఏ నక్షత్రాల్లో పుట్టినవారు ఇతరులకు నచ్చరో ఇక్కడ చూద్దాం.

అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రంలో పుట్టినవారు చాలా వేగంగా, దృఢ సంకల్పంతో స్పందించే స్వభావం కలిగి ఉంటారు. వీరి మాటలు సూటీగా, నిజాయతీగా ఉంటాయి. కానీ చాలామందికి వీరి ముక్కుసూటితనం నచ్చకపోవచ్చు. కాబట్టి వీరి మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే వీరిని ఎవ్వరూ ఎక్కువగా ఇష్టపడరు.
భరణి నక్షత్రం
భరణి నక్షత్రంలో పుట్టినవారు భావోద్వేగాల మీద ఎక్కువగా ఆధారపడతారు. చిన్న విషయాలకే బాధపడడం, ఎమోషనల్ అవ్వడం, ఎక్కువగా రియాక్ట్ కావడం వల్ల చూసే వారికి ఇది డ్రామాగా అనిపించవచ్చు. నిజానికి వీళ్లు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. కానీ ఈ సున్నితత్వం బయటికి తప్పుగా అర్థమవుతుంది.
కృత్తిక నక్షత్రం
కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఆత్మవిశ్వాసం, స్వతంత్ర స్వభావం, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చకూడదని భావిస్తారు. ఈ దృఢ సంకల్పం కొందరికి అహంకారంగా కనిపిస్తుంది. అందుకే చుట్టుపక్కల వారు వీరిని సులభంగా ఇష్టపడరు.
రోహిణి నక్షత్రం
రోహిణి నక్షత్రంలో పుట్టినవారు లోతుగా ఆలోచించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. చాలా సున్నితమైన మనసు, భావోద్వేగాలను లోపలే దాచుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు చాలా ఎమోషనల్ పర్సన్స్. కానీ అది ఇతరులకు తెలియదు. దాంతో వీరిని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. త్వరగా ఇష్టపడరు.
అనూరాధ నక్షత్రం
అనూరాధ నక్షత్రంలో జన్మించినవారు నిజాయతీగా ఉంటారు. నమ్మకమైన వ్యక్తులు. వీరు మౌనంగా ఉంటారు. లోతైన ఆలోచనలను కలిగి ఉంటారు. వీరు తాము నమ్మిన కొద్దిమందితో మాత్రమే బలమైన బంధాలు కోరుకుంటారు. అయితే చుట్టుపక్కలవారు ఈ స్వభావాన్ని అర్థం చేసుకోలేక వీరికి దూరంగా ఉంటారు.
జ్యేష్ట నక్షత్రం
జ్యేష్ట నక్షత్రంలో పుట్టినవారు తమ విలువ, గౌరవం కోసం చాలా పట్టుదలగా ఉంటారు. తమ ఆత్మగౌరవం కోసం అవసరమైతే ఏదైనా వదిలేస్తారు. కానీ ఇతరులు దీన్ని అహంకారంగా భావించి.. వీరికి దూరంగా ఉంటారు. వాస్తవానికి వీరి లోతైన వ్యక్తిత్వం, బలమైన నైతిక విలువలు, నిజాయతీ వీరికి గొప్ప బలం.

