Budha Peyarchi: బుధ సంచారంతో ఈ 3 రాశులకు దెబ్బ మీద దెబ్బ.. జాగ్రత్తగా ఉండాల్సిన కాలం
Budha Peyarchi: బుధుడు త్వరలో తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల ప్రధానంగా 3 రాశుల వారి జీవితాలు మారుతాయి. వారికి దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం ఉంది. వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభం
వృషభ రాశి 6వ ఇంట్లోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో ఈ రాశివారు ఎన్నో సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. పెండింగ్‌లో పడిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు పత్రాలను చెక్ చేయడం చాలా అవసరం. అనవసర ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ చూసుకుని ఖర్చు చేయడం అన్ని విధాలా మంచిది. తొందరపడి ఎక్కడా పెట్టుబడులు పెట్టకండి. ఆర్ధికంగా నష్టపోయే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
బుధుడు కర్కాటక రాశి వారి 4వ ఇంట్లోకి అడుగుపెడతాడు. ఈ రాశి వారు కొన్ని రోజుల పాటూ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఉద్యోగులకు ఆఫీసులో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అనుకోని ఖర్చులు, నష్టాలు పెరుగుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ రాశివారు ఎవరికైనా అప్పు ఇస్తే.. ఆ డబ్బు తిరిగి రావడం ఆలస్యంగా మారుతుంది. తోటి ఉద్యోగులు, పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేస్తున్న వారు పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారి 11వ ఇంట్లోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. కెరీర్, చదువుల విషయంలో ఈ రాశి వారి సహనాన్ని పరీక్షించే సమయం. మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు.. మరికొంత కాలం ఆగాలి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత, ఆసక్తి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వారు లేదా కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే వారు ఆర్థిక విషయాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే మీరు భారీ నష్టం జరగవచ్చు. మీరు రోజువారీ పనులు పూర్తి చేయడంలో ఆలస్యం, నిరాశ ఎదుర్కొంటారు.

