Birth Stars: ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు భర్తను ప్రాణంగా ప్రేమిస్తారు!
Birth Stars: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు ప్రేమ, ఆప్యాయతలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన అమ్మాయిలు తమ భర్తను ఎంతో ప్రేమగా, మనస్ఫూర్తిగా చూసుకుంటారట. ఆ నక్షత్రాలు ఏవో తెలుసుకుందాం.

Birth Stars Astrology
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జన్మించిన రాశి, నక్షత్రం ఆధారంగా వారి గుణగణాలను అంచనా వేయవచ్చు. ముఖ్యంగా జన్మ జాతకంలో ఏడవ ఇల్లు (కళత్ర స్థానం), శుక్రుడు, కుజుడి స్థానాలు అమ్మాయిల ప్రేమ గురించి చెబుతాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం, కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు తమ భర్తపై షరతులు లేని, అంతులేని ప్రేమను కురిపిస్తారు. మరి ఏ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు భర్త కోసం తమను తాము అంకితం చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిణి నక్షత్రం
బ్రహ్మదేవుని అంశ, చంద్రుని పూర్తి ప్రభావం ఉన్న రోహిణి నక్షత్రం అమ్మాయిలు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి సున్నితమైన మనసు ఉంటుంది. వృషభ రాశిలో ఉండే ఈ నక్షత్రం ప్రేమను అత్యున్నత స్థాయిలో వ్యక్తపరుస్తుంది. వీరు తమ భర్తను కేవలం జీవిత భాగస్వామిగా కాకుండా దేవుడిలా భావించి ప్రేమిస్తారు. భర్త అవసరాలను ముందుగానే తెలుసుకుంటారు. భర్తకు కష్టం వస్తే వీరు తట్టుకోలేరు. కుటుంబం కోసం ఎలాంటి త్యాగానికైనా వీరు వెనుకాడరు.
మఖ నక్షత్రం
కేతువు ప్రభావం, సూర్యుని సొంత ఇల్లు అయిన సింహ రాశిలో ఉండే మఖ నక్షత్రం అమ్మాయిలకు పితృ దేవతల ఆశీస్సులు ఉంటాయి. వీరు పైకి రాజసంగా, గంభీరంగా కనిపించినా.. భర్త దగ్గర మాత్రం మైనంలా కరిగిపోతారు. వీరి లగ్నం, ఏడవ ఇల్లు బలంగా ఉంటే, భర్త పట్ల వీరు చూపే విశ్వాసానికి సాటి మరొకటి ఉండదు. భర్త మాటను గౌరవించడమే తమ మొదటి బాధ్యతగా భావిస్తారు. భర్తకు ఎదురయ్యే సవాళ్లను వీరు తమ భుజాలపై వేసుకుని పోరాడతారు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా కాపాడతారు.
ఉత్తరాషాఢ నక్షత్రం
సూర్యుని ప్రభావం, గురు భగవానుడి ధనుస్సు రాశి, శని భగవానుడి మకర రాశుల కలయికతో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం అమ్మాయిలు ధర్మం తప్పని గుణం కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం
లో ఈ నక్షత్రాన్ని ఓటమి లేనిదిగా చెబుతారు. వీరి ప్రేమ కేవలం బాహ్య సౌందర్యం మీద ఆధారపడి ఉండదు, అది ఆత్మీయమైనది. భర్తలోని లోపాలను కూడా అంగీకరించి జీవితాంతం ప్రేమిస్తారు. గురు, శని ప్రభావంతో వీరు కుటుంబాన్ని అద్భుతంగా నడిపిస్తారు. భర్త సంతోషం కోసం తమ ఇష్టాలను సైతం వదులుకుంటారు. కష్టకాలంలో భర్తకు కొండంత అండగా నిలుస్తారు.

