Lucky Zodiac Signs: బుధుడి తిరోగమనం.. ఆగస్టు 11 వరకు ఈ రాశులకు తిరుగేలేదు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ప్రస్తుతం.. కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. బుధుడి తిరోగమనం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలనిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత జీవితాల్లో సంతోషాలను నింపుతుంది. మరి ఏ రాశులవారికి బుధవక్రి లాభదాయకమో చూద్దాం.

బుధుడి వక్ర గమనం
గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆగస్టు 11న తిరిగి సాధారణ గతిలోకి వస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధ వక్రి ఐదు రాశులవారికి శుభ ఫలితాలనిస్తుంది. వారి ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత సమస్యలకు తెర పడతుంది. మరి బుధుడి తిరోగమనం వల్ల ఏ రాశులవారు లాభపడతారో తెలుసుకోండి.
మేష రాశి
బుధుడు వక్రిలో ఉండటం వల్ల మేష రాశి వారికి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పాత పెట్టుబడుల నుంచి కూడా లాభాలు వస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
తుల రాశి
బుధ వక్రి తుల రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారికి సుఖ, సౌకర్యాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తిచేస్తారు. భూమి, ఆస్తి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. జీవితం ఆనందంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశివారి కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి.
మకర రాశి
బుధుడి తిరోగమనం మకర రాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో మకర రాశివారు వ్యక్తిగత, వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలు పొందుతారు. మాట తీరు మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
మీన రాశి
మీన రాశి వారికి బుధ వక్రి శుభప్రదం. ఈ రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. అనుకోకుండా కొన్ని పనులు పూర్తవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆగిపోయిన పనులు చకచక పూర్తవుతాయి.

