Mercury Jupiter Transit: బుధ-గురు గ్రహాల సంయోగం.. ఈ 3 రాశులకు డబుల్ జాక్ పాట్
Mercury Jupiter Transit: బుధ, గురు గ్రహాలు 150 డిగ్రీల దూరంలో ఉండటం వల్ల షడష్టక యోగం ఏర్పడుతోంది. దీని ఫలితంగా రాబోయే 16 గంటల్లో మూడు రాశులకు అదృష్టం పట్టనుంది.కీర్తి, ప్రతిష్ఠలు పెరగనున్నాయి.

Mercury Jupiter Transit
వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని, నక్షత్రాన్ని మారుస్తుంది. ఇలా మారిన ప్రతిసారీ అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. తొమ్మిది గ్రహాలలో బుధ, గురు గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.గురు గ్రహం సంపద,అదృష్టం, వివాహం, విద్య, మతం, అదృష్టం, పిల్లలు, శ్రేయస్సు, దాతృత్వానికి మార్గదర్శక శక్తిగా పరిగణిస్తారు. ఇక బుధ గ్రహం..తెలివితేటలు, వాక్చాతుర్యం, కమ్యూనికేషన్ కి ప్రతీకగా పరిగణిస్తారు. జనవరి 31వ తేదీన ఈ రెండు గ్రహాలు 150 డిగ్రీల కోణంలో కలవనున్నాయి. ఇది మూడు రాశుల వారికి చాలా ప్రయోజనాలను తీసుకురానుంది. అదృష్టం కూడా రెట్టింపు కానుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా...
కర్కాటక రాశి...
కర్కాటక రాశి వారికి గురు గ్రహం పన్నెండో ఇంట్లో, బుధుడు ఏడో ఇంట్లో ఉన్నాడు. దీని ఫలితంగా, బుధ-గురు కలయికతో ఏర్పడిన షడష్టక యోగం మీకు అనేక రంగాలలో ప్రయోజనాలను ఇవ్వగలదు. దీని కారణంగా, ఈ రాశిలో జన్మించిన వారికి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లాభాల వనరులు వేగంగా పెరుగుతాయి. జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. ఆధ్యాత్మికత వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి.
కుంభ రాశి..
బుధ- గురు గ్రహ కలయిక ఫలితంగా ఏర్పడిన షడష్టక యోగం కుంభ రాశిలో జన్మించిన వారికి కొత్త మార్పులను తీసుకువస్తుంది.ఈ రాశి జాతకంలో బుధుడు లగ్నంలోచ గురు గ్రహం ఐదో ఇంట్లో ఉన్నాడు. ఫలితంగా,ఈ రాశిలో జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు చూస్తారు.మీ పిల్లలకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. పిల్లల చదువుల్లో గొప్ప స్థాయికి వెళతారు.
తుల రాశి..
బుధ- గురు గ్రహ సంయోగం తుల రాశివారికి అనేక ప్రయోజనాలను మోసుకురానుంది. గురువు తొమ్మిదో ఇంట్లో, బుధుడు నాలుగో ఇంట్లో ఉన్నారు. ఫలితంగా, అదృష్టం మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీకు ఏమైనా అప్పులు ఉంటే.. ఈ సమయంలో అవి తీరిపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో గణనీయమైన లాభాలు కూడా పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

