Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మాట మీద నిలపడతారు, నమ్మకానికి మారుపేరు..!
Birth Stars: జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి నక్షత్రానికీ ఒక ప్రత్యేక స్వభావం ఉంటుంది. కొంతమందికి ఎంత కష్టమొచ్చినా అబద్ధం చెప్పడం నచ్చదు, మరి కొందరు ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పరు. అలాంటి నక్షత్రాలేంటో చూద్దాం…

Birth stars
1.ఉత్తర ఫాల్గుణి..
ఈ నక్షత్రానికి సూర్యుడు అధిపతి. స్నేహానికి, ఒప్పందానికి వీరు మారుపేరు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ధర్మబద్ధంగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా మాట ఇచ్చారంటే.. దాన్ని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళతారు. సూర్యుని ప్రభావం కారణంగా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆత్మ గౌరవం చాలా ఎక్కువ. మాట తప్పితే తమ గౌరవానికి భంగం కలుగుతుందని భావిస్తారు.
2.పుష్యమి..
నక్షత్రాలన్నింటిలోనూ ఇది అత్యంత పవిత్రమైనది. దీనికి అధిపతి శని, మార్గదర్శి బృహస్పతి. ఈ నక్షత్రాల్లో పుట్టినవారు నీతి, నిజాయితీలకు మారుపేరు.ఇతరులకు అన్యాయం చేయడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు తమ బాధ్యతను దైవంగా భావిస్తారు. అందుకే వీరు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరు.
3.అనురాధ నక్షత్రం..
ఈ నక్షత్రానికి శని అధిపతి. ఈ నక్షత్రానికి చెందిన వారు స్నేహానికి ప్రాణం ఇస్తారు. నమ్మక ద్రోహం చేయడం వీరికి రాదు. వీరు ఎవరితోనైనా బంధం ఏర్పరుచుకుంటే.. అది జీవితాంతం ఉండాలని కోరుకుంటారు. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి తమ మాటను నిలబెట్టుకుంటారు.
4.రోహిణీ నక్షత్రం..
రోహిణీ నక్షత్రానికి చంద్రుడు అధిపతి. ఈ నక్షత్రంలో పుట్టిన వారు స్థిరత్వానికి మారుపేరు. వీరు జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే.. దానికే కట్టుబడి ఉంటారు. వీరు స్వభావరీత్యా చాలా సౌమ్యులు. బాధ్యతాయుతంగా ఉంటారు. ఎదుటివారి నమ్మకాన్ని వమ్ము చేయడం వీరికి ఇష్టం ఉండదు.
5. శ్రవణ నక్షత్రం (Shravana)
శ్రవణా నక్షత్రానికి కూడా చంద్రుడు అధిపతి. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు వినడం, నేర్చుకోవడానికి ఇష్టపడతారు. వీరు ఎవరికైనా మాట ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే.. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత వీరు వెనక్కి తగ్గరు. వీరు క్రమశిక్షణకు, సంప్రదాయాలకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మాట తప్పడం అనేది వీరు చాలా పాపంగా భావిస్తారు.

