- Home
- Astrology
- Mars Transit: పది రోజులు ఓపికపడితే...ఈ 5 రాశులకు డబల్ బెనిఫిట్స్, కలలో కూడా చూడనంత డబ్బు
Mars Transit: పది రోజులు ఓపికపడితే...ఈ 5 రాశులకు డబల్ బెనిఫిట్స్, కలలో కూడా చూడనంత డబ్బు
Mars Transit: కుజ గ్రహం మరో పది రోజుల్లో తనరాశిని మార్చుకోనుంది. శుక్ర గ్రహానికి చెందిన రాశి అయిన వృషభ రాశిలోకి అడుగుపెట్టనుంది. దీని కారణంగా ఐదు రాశులకు ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..

వృషభ రాశి..
కుజ గ్రహ మార్పు వృషభ రాశివారికి చాలా మేలు చేయనుంది. కుజ గ్రహం ఈ రాశిలోకే అడుగుపెడుతోంది కాబట్టి... ఈ రాశివారు డబల్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.ఈ సమయంలో ఈ రాశివారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలను తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అపారమైన ప్రయోజనాలను పొందుతారు.
కర్కాటక రాశి..
కుజ గ్రహ సంచారం కర్కాటక రాశివారి జీవితంలోనూ చాలా మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం చేసేవారిని కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆ అవకాశాలు ఉపయోగించుకుంటే ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే... మంచి ఆదాయం పొందుతారు.
సింహ రాశి..
కుజ గ్రహ సంచారం సింహ రాశివారికి కూడా బాగా కలిసొస్తుంది. ఉద్యోగంలో పురోగతి చూస్తారు. పని చేసే చోట మంచి గుర్తింపు లభిస్తుంది. అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆదాయం పెంచుకునే మార్గాలు చాలా పెరుగుతాయి. గతంలో కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించుకోగలరు.
మీన రాశి...
మీన రాశివారికి ఈ కుజ సంచారం చాలా ప్రయోజనాలను తెస్తుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తిపరంగా జీవితం ఆనందంగా మారుతుంది. ఈ సమయంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా కూడా మంచి ఆదాయం పొందుతారు. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు.

