Astrology: శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారా.? ఇలా చేస్తే అన్నింటా విజయమే
న్యాయం, కర్మలకు ప్రతీకగా శని దేవుడిని చెబుతుంటారు. మనం చేసిన పనులను బట్టి ఫలితాలు ఇచ్చే శక్తి శనికి ఉంది. అయితే ఏలిన నాటి శని, ధైయ్య, మహాదశ లాంటి సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శని ప్రభావం ఉంటే ఏం జరుగుతుంది.?
శనిదోషం ఉన్నవారు కొన్ని రకాల ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా పదే పదే అనవసర సమస్యలు రావడం, కుటుంబ కలహాలు ఏర్పడడం, కోర్టు కేసుల్లో ఆలస్యం కావడం, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నిరాశలు ఎదురుకావడం, ఆత్మవిశ్వాసం లోపించడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలు ఉంటే శని దోషం ఉందని అర్థం చేసుకోవాలి.
శని దోష నివారణకు పాటించాల్సిన మార్గాలు
హనుమాన్ పూజ:
శని దోష నివారణకు హనుమంతుడిని భక్తితో పూజించడం ఎంతో శ్రేయస్కరం. హనుమాన్ చాలీసా నిత్యం పఠించటం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ప్రతీ రోజూ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి.
వీటిని దానం చేయాలి
శని మంత్ర జపం:
ప్రతిరోజూ “ఓం శం శనైశ్చరాయ నమః” మంత్రాన్ని 108 సార్లు జపించండి. శనికి భక్తి చూపిస్తే శాంతి కలుగుతుంది.
దానం చేయడం:
శనివారాల్లో నల్ల నువ్వులు, నల్ల బట్టలు, ఇనుప పాత్రలు దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. శనికి ఆవ నూనె ఎంతో ఇష్టం కాబట్టి ఆవ నూనె సమర్పించడమూ శుభప్రదం.
నీలం రత్నం ధరించాలా?
శని దోష నివారణకు కొన్ని సందర్భాల్లో నీలం (బ్లూ శఫైర్) రత్నం ధరించమని సలహా ఇస్తారు. కానీ ఇది చాలా శక్తివంతమైన రత్నం కాబట్టి, జ్యోతిష్యుడి సలహా లేకుండా ధరించకూడదు. తప్పుగా ధరిస్తే శుభం కంటే అపశుభమే ఎక్కువ.
ఆవ నూనెతో దీపం
ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల శని గ్రహం శాంతిస్తుంది. ఇది ఓ పవిత్ర ఆచారం. దీపాన్ని వెలిగించేటప్పుడు భక్తితో ప్రార్థన చేయాలి. దీనివల్ల జీవితంలో నెమ్మదిగా మార్పులు మొదలవుతాయి. శని ప్రభావం తగ్గి మంచి జరుగుతుంది. అదే విధంగా శని ప్రభావంలో కూడా కొన్ని సానుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.