- Home
- Astrology
- Zodiac sign : ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 5 రాశుల వారికి కోటీశ్వర యోగం
Zodiac sign : ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 5 రాశుల వారికి కోటీశ్వర యోగం
Laxmi Narayana Raja Yoga 2026 : వచ్చే ఫిబ్రవరిలో కొన్ని రాశులవారి జాతకమే మారిపోనుంది. కష్టాలు తొలగిపోయి రాజయోగం కలుగుతుందట. ప్రమోషన్లు, డబ్బులు, లక్ కలిసిరావడం… అంతా అనుకూలంగా జరుగుతుంది.

ఈ ఫిబ్రవరిలో 5 రాశులకు రాజయోగమే...
Laxmi Narayana Raja Yoga 2026 : జ్యోతిషం ప్రకారం, ఫిబ్రవరి 2026 చాలా ముఖ్యమైన నెల. ఫిబ్రవరి 3న కుంభరాశిలో బుధ, శుక్రుల కలయికతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది.. దీనివల్ల ఓ 5 రాశులవారికి రాజయోగం కలుగుతుంది. ఇలా ఫిబ్రవరిలో జాతకం మారిపోయే ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి
మేషరాశికి 11వ ఇంట్లో బుధ, శుక్రుల కలయిక జరుగుతుంది. ఇది ఆదాయ స్థానం. ఇక్కడ ఏర్పడే లక్ష్మీ నారాయణ యోగం కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుంది. వివిధ కారణాలతో స్ట్రక్ అయిన డబ్బులు కూడా తిరిగి లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృషభ రాశి
శుక్రుడు ఈ రాశికి అధిపతి. బుధ-శుక్రుల కలయికతో ఏర్పడే లక్ష్మీ నారాయణ యోగం ఈ రాశికి 10వ ఇంట్లో అంటే వృత్తి స్థానంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి.
మిథున రాశి
మిథున రాశికి 9వ ఇంట్లో ఈ కలయిక జరుగుతుంది. ఇది అదృష్ట స్థానం. ఈ సమయంలో అదృష్టం అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులు విద్యలో గొప్ప విజయం సాధిస్తారు.
తులా రాశి
తులా రాశికి 5వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది విద్య, ప్రేమ, పిల్లలకు సంబంధించినది. దీనిని పూర్వ పుణ్య స్థానం అంటారు. ఈ సమయంలో కళ, రచన రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ సంబంధాలు మధురంగా మారతాయి.
కుంభ రాశి
కుంభ రాశికి మొదటి ఇంట్లో ఈ కలయిక జరుగుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వివాహితుల సంబంధం మధురంగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన మెరుగుపడుతుంది.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం జ్యోతిషుల అభిప్రాయాలు, పంచాంగం ఆధారంగా ఇంటర్నెట్ లో లభించింది. ఏసియానెట్ తెలుగు దీన్ని ధృవీకరించలేదు. సమాచారాన్ని అందించడమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయతకు ఏసియానెట్ తెలుగు బాధ్యత వహించదు)

