MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Palmisthry: మీ అరచేతిలో ఇలా Y గుర్తు ఉందా? అయితే మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా?

Palmisthry: మీ అరచేతిలో ఇలా Y గుర్తు ఉందా? అయితే మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా?

Palmisthry: హస్త సాముద్రికం ప్రకారం అరచేతిలోని రేఖలు ఏమో పిచ్చి గీతలు కావు, అవి భవిష్యత్తుకు అర్ధాలు. కొన్ని గుర్తులు జీవితంలో ఆ వ్యక్తి ధనవంతుడా? లేక పేదవాడా అన్నది కూడా నిర్ణయిస్తుంది. అలాంటిదే అరచేతిలో ఉండే Y గుర్తు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 05 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హస్తా సాముద్రికంలో వై గుర్తు
Image Credit : Getty

హస్తా సాముద్రికంలో వై గుర్తు

హస్త సాముద్రిక శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అరచేతులపై ఉన్న రేఖల ఆధారంగా భవిష్యత్తును చెప్పేదే హస్త సాముద్రికం. అరచేతిలో ఉన్న కొన్ని రేఖలు ఆ వ్యక్తి, వ్యక్తిత్వాన్నే కాదు అతడు భవిష్యత్తును కూడా అంచనా వేసి చెబుతాయి. అతడు ధనవంతుడిగా జీవిస్తాడో, పేదవాడిగా ఉంటాడో కూడా వివరిస్తాయి. వ్యక్తి జీవితంలో సంపద, కీర్తి, ఆరోగ్యానికి సంబంధించిన లోతైన రహస్యాలను చెబుతాయి. అలాంటి వాటిలో అరచేతిలో ఉండే ఒక Y గుర్తు కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ Y గుర్తు మీకు ఉంటే అది వరమో, శాపమో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వరమా? శాపమా?
Image Credit : Getty

వరమా? శాపమా?

హస్త సాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఉండే ఈ Y గుర్తు అపారమైన విజయాన్ని తీసుకొస్తుందని చూపిస్తుంది. లేదా జీవితంలో పోరాటం చేయాల్సి వస్తుందని చెబుతుంది. జీవన రేఖ (Life line) నుండి ఒక గీత చంద్రుని పర్వతం వైపు విస్తరించి ఉంటే అది Y ఆకారాన్ని ఏర్పరుస్తుంది. ఇది చాలా శుభప్రదమైనది. అలాంటి వ్యక్తులు పుట్టుకతోనే వ్యాపారవేత్తలుగా ఉంటారు. అంటే వ్యాపారవేత్తల కుటుంబంలో జీవిస్తారు. అలాగే విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అరచేతిలో ఉన్న ఈ గుర్తు సుదూర ప్రయాణాలను సూచిస్తుంది. అలాంటి వ్యక్తులు సమాజంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. సౌకర్యాలు విలాసాలతో గడుపుతారు.

33
ప్రతికూలత కూడా
Image Credit : Getty

ప్రతికూలత కూడా

హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలో ఉన్న ప్రతి Y గుర్తు శుభప్రదమైనది కాదు. జీవన రేఖ నుండి ఒక చిన్న బలహీనమైన రేఖ ఉద్భవించి Y ఆకారంలా కనిపిస్తూ ఉంటే అది ప్రతికూల సంకేతంగా భావించాలి. ఇది జీవశక్తిని తగ్గిస్తుంది. ఆ వ్యక్తులు తరచూ అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. శారీరకంగా బలహీనంగా ఉంటారు. జీవితంలో పోరాటాలు చేయాల్సి వస్తుంది.

ఇక Y గుర్తు మణికట్టు నుండి జీవన రేఖ జంక్షన్ లో ఏర్పడితే అది జీవితంలో ప్రారంభ దశను సూచిస్తుంది. ఆ ప్రారంభ దశలో చాలా పోరాటాలు చేయాల్సి వస్తుందని చెబుతుంది. పోరాటాలు చేశాక మాత్రం అపారమైన పెద్ద విజయాలను అందుకుంటారని సూచిస్తుంది. కష్టపడి పని చేయడం ద్వారా ఆ వ్యక్తి జీరో నుండి హీరోగా ఎదుగుతాడని ఈ Y రేఖ సూచిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!
Related Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబు నటిస్తూ నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Shani Dosha: శని కష్టాల నుంచి ఈ రాశులకు విముక్తి.. డబ్బు, ప్రశాంతమైన జీవితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved