Zodiac signs: కృష్ణాష్టమికి గ్రహాలలో మార్పులు.. ఈ నాలుగు రాశుల కష్టాలు తీరినట్లే..!
ఈ ఏడాది జన్మాష్టమి రోజున ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు గ్రహాలు తిరోగమనం చేయనున్నాయి. శని, రాహువు, కేతువు గ్రహాలు తిరోగమనం చేయనున్నాయి

Zodiac signs
జోతిష్యశాస్త్రంలో కృష్ణ జన్మాష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీకృష్ణుడు జన్మదినం సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున మనం ఈ జన్మాష్టమి పండగను జరుపుకుంటాం. ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్టు 16వ తేదీన వస్తోంది. ఈ ఏడాది జన్మాష్టమి రోజున గ్రహాలు, నక్షత్రాల ప్రత్యేక సంయోగం ఏర్పడనుంది.
ఈ ఏడాది జన్మాష్టమి రోజున ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు గ్రహాలు తిరోగమనం చేయనున్నాయి. శని, రాహువు, కేతువు గ్రహాలు తిరోగమనం చేయనున్నాయి. ఈ గ్రహ కదలికలో ఈ మార్పు కారణంగా నాలుగు రాశులకు చెందిన వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది. ఇప్పటి వరకు వారికి ఎదురైన కష్టాలన్నీ తొలగిపోతాయి. మంచి రోజులు ప్రారంభం అవుతాయి. మరి, ఆ నాలుగు రాశులేంటో చూద్దామా...
1.వృషభ రాశి...
శని, రాహువు, కేతువుల తిరోగమన కదలిక కారణంగా, కృష్ణాష్టమి తర్వాత వృషభ రాశిలో జన్మించిన వారికి మంచి రోజులు ప్రారంభమౌతాయి. గతంలో ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నా.. అవన్నీ ఈ సమయంలో పూర్తిగా తగ్గిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. గౌరవం, ఖ్యాతీ పెరుగుతుంది. ఈ సంవత్సరం కృష్ణజన్మాష్టమి నాడు గ్రహాల గమనంలో మార్పుల కారణంగా, మీ వివాహ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి సామరస్యం ఏర్పడుతుంది. ఆ కృష్ణుని ఆశీస్సులతో, సంపదకు సంబంధించిన మీ సమస్యలు తొలగిపోతాయి. అందువలన, మీ మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటే.. ఇది సరైన సమయం. బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.
2.సింహ రాశి...
సింహ రాశివారిపై శ్రీ కృష్ణుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇక.. కృష్ణాష్టమి తర్వాత.. ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు చాలా ఎక్కువగా కలగనున్నాయి. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రాశివారికి పిల్లల భవిష్యత్తు గురించి ఏవైనా బాధలు ఉన్నా అవి తీరిపోతాయి. మీ పిల్లల భవిష్యత్తు ఆనందంగా మారుతుంది. ఈ రాశివారు ఏదైనా వ్యాపారం చేసినా మంచి లాభాలు వస్తాయి. కృష్ణుని ఆశీస్సులతో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటారు.
తుల రాశి..
శని, రాహు, కేతువుల తిరోగమన కదలిక , బుధుడు ప్రత్యక్షంగా సంచరించడం వలన, తుల రాశి వారు ఈ కాలంలో ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా పెరుగుతుంది. ఈ కాలంలో తుల రాశి వారు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, గ్రహాల సంచారం కారణంగా, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు శారీరకంగా , మానసికంగా చాలా బలంగా ఉంటారు. వ్యాపారం చేసే తుల రాశి వారిపై శ్రీకృష్ణుని అపారమైన అనుగ్రహం ఉన్నందున, మీరు చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. చాలా పురోగతి సాధిస్తారు. దీని కారణంగా, మీ పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఈ కాలంలో తుల రాశి వారు తమ పిల్లల నుండి శుభవార్త పొందుతారు.
మీన రాశి..
గ్రహాల తిరోగమనం కారణంగా.. మీన రాశి వారికి ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున గ్రహాల కలయిక కారణంగా, మీన రాశి వారి అదృష్టం మారుతుంది. ఈ సమయంలో మీరు మీ డబ్బు , సంపదకు సంబంధించిన అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా.. లాభాలు చవి చూస్తారు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. వ్యాపారంలో బాగా కలిసొస్తుంది. ఉద్యోగంలో కూడా మంచి స్థాయికి వెళతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.
మీరు కూడా వృషభం, సింహ, తుల, మీన రాశులలో ఒకరు అయితే, ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి నాడు..శని, రాహు, కేతువుల తిరోగమన కదలిక , బుధ గ్రహం ప్రత్యక్ష కదలిక కారణంగా మీ అదృష్ట సమయం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీ అదృష్టానికి దారులు తెరుచుకుంటాయి. మీరు మీ జీవితంలోని ప్రతి అడుగులోనూ విజయం సాధిస్తారు. మీ జీవితం ఆనందం, శ్రేయస్సు, సంపదలతో నిండి ఉంటుంది.

