MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Zodiac signs: వ్యాపార ప్రపంచంలో ఈ రాశులవారిది మహారాజ యోగమే, ఏ వ్యాపారం చేసినా కాసుల వర్షమే..!

Zodiac signs: వ్యాపార ప్రపంచంలో ఈ రాశులవారిది మహారాజ యోగమే, ఏ వ్యాపారం చేసినా కాసుల వర్షమే..!

ఒక వ్యాపారం కలిసిరాకపోయినా.. మరో వ్యాపారం చేసి అయినా.. వీరు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. అంగారక గ్రహ ప్రభావం కారణంగా, ఈ రాశివారు పోటీ వాతావరణంలో తట్టుకొని నిలపడగలరు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 11 2025, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Zodiac sign
Image Credit : AI Meta

Zodiac sign

జోతిష్య శాస్త్రంలో, ప్రతి రాశి చక్రానికి జీవితంలో విజయం సాధించడానికి ప్రత్యేకమైన లక్షణాలు, ప్రతిభ, అవకాశాలు ఉంటాయి. కొందరు ఉద్యోగం చేసి బాగా రాణించగలిగితే, మరి కొందరు వ్యాపారంలో మాత్రమే బాగా రాణించగలరు. ముఖ్యంగా.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. నాలుగు రాశులకు చెందిన వారు వ్యాపారంలో రాజ్యమేలుతారు. వారు ఏ వ్యాపారం మొదలుపెట్టినా... లాభాల బాట పట్టే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.మేష రాశి..
Image Credit : Asianet News

1.మేష రాశి..

మేష రాశివారిని అంగారక గ్రహం పాలిస్తూ ఉంటుంది. ధైర్యం, మార్గదర్శక స్వభావం, త్వరిత నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. వ్యాపార ప్రపంచంలో మేష రాశివారు చక్రవర్తులు కాగలరు. ఈ రాశివారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చినా ఎదుర్కునే శక్తి వీరిలో ఉంటుంది. ఆ తర్వాత లాభాల బాట పడతారు. ఒక వ్యాపారం కలిసిరాకపోయినా.. మరో వ్యాపారం చేసి అయినా.. వీరు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. అంగారక గ్రహ ప్రభావం కారణంగా, ఈ రాశివారు పోటీ వాతావరణంలో తట్టుకొని నిలపడగలరు. తీసుకున్న నిర్ణయాలను త్వరగా అమలు చేసి, సవాళ్లను ఎదుర్కునే సామర్థ్యం కలిగి ఉంటారు. వ్యాపారంలో దూసుకుపోతారు.

బలహీనతలు: అసహనం, కోపం వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టి పెట్టడం వారికి సవాలుగా ఉండవచ్చు.

35
  2.సింహ రాశి...
Image Credit : Asianet News

2.సింహ రాశి...

సింహ రాశివారు కూడా వ్యాపారంలో బాగా రాణించగలరు. ఈ రాశివారిని సింహ రాశి పాలిస్తూ ఉంటుంది. వీరికి అందరికీ ఆకర్షించే శక్తి ఉంటుంది. వీరిలోనూ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు వ్యాపారంలో రాణించడమే కాదు.. తమ వ్యాపారాన్ని మంచి బ్రాండ్ గా మార్చగల శక్తి కలిగి ఉంటారు. వారి ప్రత్యేక శైలి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. వీరు ఎందులో పెట్టుబడులు పెట్టినా.. మంచి లాభాలు సాధించగలరు. వీరి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. మీడియా, వినోద రంగంలో వీరు బాగా రాణించగలరు.

బలహీనతలు: అధిక శ్రద్ధ అవసరం కొన్నిసార్లు వారిని అహంకారంగా చేస్తుంది. ఇతరుల అభిప్రాయాలను వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ధోరణి ఉండవచ్చు.

45
  3.తుల రాశి...
Image Credit : Asianet News

3.తుల రాశి...

తుల రాశివార ప్రతి విషయంలోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వీరు ప్రజలతో బాగా కనెక్ట్ అవుతారు. మాటలతో అందరినీ మంచి చేసుకుంటారు. ఫలితంగా వ్యాపారంలో విజయం సాధించగలరు. తుల రాశి వారు నైపుణ్యం కలిగిన సంధానకర్తలు. తమ వ్యాపార భాగస్వాములతో మంచి భాగస్వాములుగా ఉంటారు. నిజాయితీగా వ్యాపారం చేసి.. లాభాలు పొందుతారు. వారి సమతుల్య విధానం వ్యాపారంలో నమ్మకాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. శుక్రుని ప్రభావం వల్ల, వారు అందం, లగ్జరీ , కళ సంబంధిత వ్యాపారాలలో (ఉదా. ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైన్, సౌందర్య సాధనాలు) విజయం సాధిస్తారు.

బలహీనతలు: నిర్ణయాలు తీసుకోవడానికి ఆలస్యం చేయడం వారి పురోగతిని ఆలస్యం చేస్తుంది. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం కొన్నిసార్లు వారికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది.

55
4.మకర రాశి...
Image Credit : Asianet News

4.మకర రాశి...

క్రమశిక్షణ, దీర్ఘకాలిక ప్రణాళిక, బాధ్యత లో మకర రాశివారు ముందుంటారు. ఈ రాశివారు వ్యాపార ప్రపంచంలో మహారాజులు కాగలరు. వారి క్రమశిక్షణా విధానం , కృషి వారిని చక్రవర్తులను చేస్తాయి. మకరరాశి వారు అద్భుతమైన ప్రణాళికదారులు. వారు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి స్పష్టమైన వ్యూహాలను రూపొందిస్తారు. శని ప్రభావం కారణంగా, వారు ఆర్థిక నిర్వహణలో నిపుణులు. వారు ఖర్చులను నియంత్రిస్తారు. తెలివిగా పెట్టుబడులు పెడతారు. వారి బాధ్యత , విశ్వసనీయత కస్టమర్‌లు భాగస్వాముల మధ్య నమ్మకాన్ని పెంచుతాయి.

బలహీనతలు:కొత్త మార్పులను అంత తొందరగా అంగీకరించరు. ఇది మాత్రమే వారి బలహీనత. పనిపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల వ్యక్తిగత సంబంధాలు దూరం చేసుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల వారిని ప్రేమిస్తే.. మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు జాగ్రత్త..!
Recommended image2
Zodiac signs: ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved