MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ketu Transit: మఖ నక్షత్రంలోకి కేతు సంచారం.. ఈ 3 రాశులకు ఆర్ధిక బలం

Ketu Transit: మఖ నక్షత్రంలోకి కేతు సంచారం.. ఈ 3 రాశులకు ఆర్ధిక బలం

Ketu Transit: కేతువు మార్చి 29న తన సొంత నక్షత్రమైన మఘలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశులకు బీభత్సంగా కలిసివస్తుంది. ఈ రాశుల వారికి అదృష్టం పడుతుంది. ఆర్ధికంగా వీరు బలంగా మారిపోతారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 29 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మఖ నక్షత్రంలోకి కేతువు
Image Credit : Asianet News

మఖ నక్షత్రంలోకి కేతువు

వేద జ్యోతిషశాస్త్రంలో కేతువును ఒక రహస్యమైన గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహం వల్ల చెడు ప్రభావాలే కాదు కొన్ని సార్లు మంచి కూడా జరుగుతుంది. కేతువు వల్ల రాశుల వారి జీవితంలో ఆకస్మిక మార్పులు, రహస్యాలు, వైరాగ్యం వంటివి కలుగుతాయి. ఒక వ్యక్తి జాతకంలో కేతువు బలంగా ఉంటే  ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. 

కేతువుకు సొంత రాశి అంటూ లేదు. కానీ అశ్విని, మఘ, మూల నక్షత్రాలకు అధిపతిగా కేతువును చెప్పుకుంటారు.  మార్చి 29న సింహరాశిలో ఉన్న కేతువు తన సొంత నక్షత్రమైన మఖలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. ఆ రాశులేవో తెలుసుకోండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి మంచిది. జీవితంలో పురోగతి సాధించేందుకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనుకూల సమయం అని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఈ సమయంలో తీసుకునే  నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

కేతువు  మఖ నక్షత్రంలోకి వెళ్లడం వల్ల  సింహ రాశి వారు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. మఘ నక్షత్రం సింహరాశికే చెందినదే. దీని వల్ల వీరికి మంచి లాభాలు అందుతాయి. పాత పెట్టుబడులు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు అవకాశాలు అధికంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయం బాగా కలిసొస్తుంది. కుటుంబంలో ఉన్న గొడవలన్నీ తగ్గిపోతాయి. 

44
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి కేతువు మఖ నక్షత్రంలోకి సంచారించడం మంచి ఫలితాలను అందిస్తుంది. వృత్తిపరంగా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి  ఆఫీసులో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్న స్తబ్దత తొలగిపోతుంది. పోటీ పరీక్షలు రాసేవారు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Rahu Ketu Effects: రాహు కేతువుల వల్ల ఈ 5 రాశులకు జీవితంలో కష్టాలు తప్పకపోవచ్చు
Recommended image2
Top 5 Budget Cars: రూ.6 లక్షల లోపు వచ్చే టాప్ 5 ఫ్యామిలీ కార్లు ఇవిగో, లగ్జరీగా కనిపిస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved