Jupiter Venus Transit: ఆరు రాశులకు నెలరోజులు కాసుల వర్షమే
గ్రహాల మార్పులు జోతిష్యశాస్త్రంలో రాశులను ప్రభావితం చేస్తాయి. గురు గ్రహం,శుక్ర గ్రహం ప్రస్తుతం నక్షత్రాలను మార్చుకుంటున్నాయి. ఈ మార్పు నెలరోజులు ఆరు రాశులకు మేలు చేయనుంది.

జోతిష్యశాస్త్రంలో గురు, శుక్ర గ్రహాలను శుభ గ్రహాలుగా పరిగణిస్తారు. గురువు మృగశిర నక్షత్రంలో, శుక్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించనున్నారు. ఈ రెండు గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి బలాన్ని తీసుకురానుంది.ముఖ్యంగా ధనయోగం తీసుకురానుంది.ఈ యోగం వచ్చే నెల 31వ తేదీ వరకు అంటే మే 31వ తేదీ వరకు ఉంటుంది. మరి, ఈ యోగం ఏయే రాశులకు లాభం చేకూరుస్తుందో తెలుసుకుందాం..
telugu astrology
1.వృషభ రాశి...
ఈ రాశికి గురువు అధిపతి.శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు.ఈ రెండు రాశులు పరస్పరం మార్పు చెందడం వల్ల వృషభ రాశి వారికి అనుకూలిస్తుంది.సంపద పెరుగుతుంది. ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు ఇవ్వనుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది.
ఆస్తులపై ఉన్న వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. షేర్లు, పెట్టుబడుల ద్వారా ఆకస్మిక లాభాలు చేకూరుతాయి. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
telugu astrology
కర్కాటక రాశి..
భాగ్య, లాభస్థానాల అధిపతులు అయిన గురు, శుక్రులు పరస్పరం మారడం వల్ల ఈ రాశివారు పట్టినది బంగారం చేసే అవకాశాలు పొందుతారు. అకస్మిక ధన లాభం, శ్రేణి ఎదుగుదల ఆశించవచ్చు. స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో లాభం కనిపిస్తుంది. విలాసవస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. సంపన్న వర్గానికి చెందిన వ్యక్తితో సంబంధం ఏర్పడే సూచనలు ఉన్నాయి.
telugu astrology
కన్య రాశి..
సప్తమ, భాగ్యాధిపతులైన గురు, శుక్రుల పరివర్తన వల్ల కన్య రాశివారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి సంబంధిత వివాదాలు విజయవంతంగా పరిష్కారమై ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగాల్లో జీతాలు పెరగడం, వ్యాపారాల్లో వృద్ధి జరగడం జరుగుతుంది. కీలక ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
telugu astrology
వృశ్చిక రాశి..
పంచమ, సప్తమ స్థానాధిపతులైన గురు, శుక్రుల పరస్పర మార్పు వలన వృశ్చిక రాశివారికి వృత్తి పరంగా పదోన్నతులు, జీత భత్యాల పెరుగుదల ఖాయం. వ్యాపారాల్లో విస్తరణలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఎదురుకానున్నాయి. ప్రేమ సంబంధాలు మధురంగా కొనసాగుతాయి. సంపద స్థాయి స్పష్టంగా పెరుగుతుంది.
telugu astrology
మకర రాశి..
శుభ గ్రహాలైన గురు, శుక్రులు పరస్పరం మార్పు జరుపుకోవడం వల్ల మకర రాశివారికి ఆశించిన వృద్ధి లభిస్తుంది. సంపన్న వర్గానికి చెందిన వ్యక్తితో సంబంధాలు ఏర్పడుతాయి. ఉద్యోగాల్లో జీతాల పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు పెరిగి, పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి. షేర్ మార్కెట్ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి.
telugu astrology
కుంభ రాశి..
ద్వితీయ, చతుర్థ స్థానాల మధ్య పరస్పర మార్పు కొనసాగడం వల్ల కుంభ రాశివారికి అనేక మార్గాల్లో ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధనాగమానికి అవకాశముంది. చిన్నచిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలుగా మారతాయి. ప్రముఖులతో లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల నుంచి ఆస్తి లాభం పొందే అవకాశముంది. ఉద్యోగాలలో పదోన్నతులు, జీత భత్యాల వృద్ధి కనిపిస్తుంది.