Kendra Drishti Yoga: గురు,శని గ్రహాల కలయిక.. ఈ నాలుగు రాశులకు ఊహించనంత డబ్బు..!
గరు గ్రహం, శని గ్రహం రెండూ కలిసి కేంద్ర దృష్టి యోగం ఏర్పరుస్తున్నాయి. మరి, దీని వల్ల ఏ రాశుల వారికి అదృష్ట యోగం కలగనుందో తెలుసుకుందామా…

గ్రహాల మార్పులు..
జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచూ మారుతూ ఉంటాయి. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి. ఈ మారే క్రమంలో రెండు రాశుల మధ్య ఏర్పడో కోణం కూడా రాశులపై ప్రభావితం చూపిస్తుంది. జూన్ 15వ తేదీన గురు, శని గ్రహాలు 90 డిగ్రీల కోణంలో ఏర్పడ్డాయి. దీని కారణంగా కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా నాలుగు రాశులకు చాాలా మేలు జరగనుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు మరీ ఎక్కువగా కలగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూసేద్దాం..
వృషభ రాశి..
కేంద్ర దృష్టి యోగం.. వృషభ రాశివారికి చాలా మేలు చేయనుంది. ముఖ్యంగా..వృషభ రాశి వారికి ఆర్థిక ప్రగతి, వ్యాపారంలో విజయం లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది.
కన్య రాశి..
కన్య రాశి వారికి వ్యక్తిగత, వృత్తి జీవితంలో విజయం లభించే అవకాశం ఉంది. ఎంతో కాలంగా జరగడం లేదు అనుకున్న పనులు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన విద్యార్థులకు చదువులో దూసుకుపోతారు. మంచి మార్కులు వస్తాయి.
ధనస్సు రాశి..
ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం. పెండింగ్ పనులు పూర్తౌతాయి.
కుంభ రాశి...
కుంభ రాశి వారికి శని దృష్టి శుభప్రదం. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఆల్రెడీ ఉద్యోగం లో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.