Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు మాటలతో మ్యాజిక్ చేస్తారు..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం, మన పుట్టిన తేదీ మన వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. కొందరు వ్యక్తులు పుట్టుకతోనే అద్భుతమైన వాగ్ధాటిని కలిగి ఉంటారు. వారు మాట్లాడటం మొదలుపెడితే ఎదుటివారు కూడా మైకంలో మునిగిపోయినట్లు చెప్పింది వినేస్తారు

నెంబర్ 5...
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారంతా కమ్యూనికేషన్ మాస్టర్స్ అని పిలవచ్చు. బుధ గ్రహ ప్రభావం కారణంగా ఈ తేదీల్లో పుట్టిన వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా సమయస్ఫూర్తితో ఉంటారు. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే చాలా వేగంగా స్పందిస్తారు. కష్టమైన విషయాన్ని కూడా చాలా హాస్యభరితంగా, సరళంగా చెప్పగలరు. కొత్త వ్యక్తులతో కూడా నిమిషాల్లో స్నేహం చేయడం వీరి నైజం. మార్కెటింగ్, సేల్స్, యాంకరింగ్ వంటి రంగాల్లో వీరు తిరుగులేని విజయం సాధిస్తారు.
నెంబర్ 3...
ఏ నెలలో అయినా 3, 12, 30 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారంతా జ్ఞానానికి ప్రతిరూపాలు. వీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే... వీరు గొప్ప వక్తలు. అందరికీ అవసరమైన సలహాలు ఇస్తారు. వారి మాటల్లో ఉండే గాంభీర్యం ఎదుటివారిలో గౌరవాన్ని కలిగిస్తుంది. వీరు కథలు చాలా అద్భుతంగా చెప్పగలరు. టీచర్లుగా, మోటివేషనల్ స్పీకర్లుగా వీరు జనాలను ఇట్టే ప్రభావితం చేస్తారు.
నెంబర్ 6..
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై శుక్ర గ్రహప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి మాటల్లో ఒక రకమైన మాధుర్యం, ఆకర్షణ కనిపిస్తాయి. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. చాలా మృదువుగా, ప్రేమగా మాట్లాడతారు. ఎవరిని ఎలా ఒప్పించాలో వీరికి బాగా తెలుసు.
వీరి గొంతులో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. వీరు ఎవరినైనా విమర్శించినా, అది ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడగలరు. కళలు, మీడియా రంగాల్లో వీరు రాణిస్తారు.

