Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళి అమ్మాయి భార్యగా వస్తుంది..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళి అమ్మాయిలు భార్యగా వస్తారట. అంటే, వారిపై పెత్తనం చెలాయించే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి భార్యగా వచ్చే అవకాశం ఉంది.

Birth Date
న్యూమరాలజీ, జోతిష్యశాస్త్రం ప్రకారం, అబ్బాయిలు వారు పుట్టిన తేదీ ఆధారంగా వారి జీవిత భాగస్వామి స్వభావం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. మరీ ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళి అమ్మాయిలు భార్యగా వస్తారు.అంటే...ఈ అమ్మాయిలు తమ భర్తపై అధికారం చెలాయిస్తారు. ప్రతిదీ వారు చెప్పినట్లే జరిగేలా చేస్తారు. మరి.. ఏ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు ఇలాంటి భార్యలు వస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...
1.నెంబర్ 2...
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సన్నిత మనసు కలిగి ఉంటారు. వీరు ఏ విషయంలోనూ తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు. వీరికి వచ్చే భార్యలే ప్రతి విషయంలోనూ నిర్ణయం తీసుకుంటారు. అన్ని విషయాల్లోనూ వారి భార్యలదే పై చేయిగా ఉంటుంది. ఈ అబ్బాయిలు తప్పక ప్రతి విషయంలోనూ తమ భార్య చెప్పిందే వింటారు.
ఈ అబ్బాయిలు చాలా సౌమ్యంగా ఉంటారు కాబట్టి... వీరి జీవితంలోకి వచ్చే అమ్మాయిలు.. వాళ్లను ఒక ఆట ఆడుకుంటారు. కీలు బొమ్మలా చేసి ఆడిస్తారు.
2.నెంబర్ 8..
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీలలో పుట్టినవారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ శని గ్రహ ప్రభావం కారణంగా వీరు వైవాహిక జీవితంలో చాలా క్రమశిక్షణతో ఉంటారు. అయితే, వీరితో వీరి భార్య మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఈ అబ్బాయిలకు గయ్యాళి అమ్మాయి భార్యగా వస్తుంది. దీంతో ఈ అబ్బాయిలకు ప్రతి విషయంలోనూ భార్యతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ అబ్బాయిలు తమ భార్య మాట వినలేదో.. ఇంట్లో రణరంగమే.
3. నెంబర్ 9..
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు చాలా చురుకుగా,కోపంగా ఉంటారు. ఇక.. వీరి జీవితంలోకి వచ్చే అమ్మాయిల మనస్తత్వం కూడా ఇంచు మించు ఇలానే ఉంటుంది. ఫలితంగా ఇద్దరూ ప్రతి విషయంలోనూ వాదించుకుంటూ ఉంటారు.తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి.

