Gold Astrology: బంగారాన్ని పొరపాటున కూడా ఈ రోజు అస్సలు కొనకూడదు! ఎందుకో తెలుసా?
చాలామంది బంగారం కొనేటప్పుడు మంచి రోజు, టైం చూసుకుంటారు. నిజానికి అది ముఖ్యం కూడా. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వారాల్లో బంగారం కొనడం శుభంగా.. మరికొన్ని వారాల్లో కొనడాన్ని అశుభంగా పరిగణిస్తారు. మరి ఏ రోజుల్లో బంగారం కొనకూడదో ఇక్కడ చూద్దాం.

బంగారం ఎప్పుడు కొనాలి?
బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. ప్రతి ఒక్కరు వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఎంతో కొంత బంగారం కొంటూనే ఉంటారు. ఇంట్లో బంగారం ఉంటే.. ఎప్పుడూ డబ్బులు నిల్వకు ఉన్నట్లేనని చాలామంది అనుకుంటారు. అందుకే ఉన్నంతలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం కొనేటప్పుడు చాలామంది మంచి రోజు, టైం చూసుకుంటారు. మంచి రోజు కొంటే సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్ముతారు. మరి జ్యోతిష్యం ప్రకారం ఏ రోజు బంగారం కొనాలి? ఏ రోజు కొనకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం కొనేటప్పుడు..
బంగారాన్ని సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇది లక్ష్మీదేవి, కుబేరులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ధంతేరాస్, దీపావళి, అక్షయ తృతీయ, దసరా రోజుల్లో బంగారం, వెండి ఆభరణాలు కొనడం శుభప్రదంగా భావిస్తారు. అయితే బంగారం కొనేటప్పుడు వారంలోని రోజులను కూడా గుర్తుంచుకోవాలి.
ఏ రోజు బంగారం కొనాలంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం.. సూర్యుడు, గురు గ్రహానికి సంబంధించింది. కాబట్టి గురువారం, ఆదివారం బంగారం కొనడానికి మంచిరోజులుగా చెప్తారు. ఈ రోజున బంగారం కొనడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం.
ఏ రోజు బంగారం కొనకూడదు?
జ్యోతిష్యం ప్రకారం శనివారం నాడు బంగారం కొనడం మంచిదికాదట. జీవితంలో సమస్యలు వస్తాయట. సాధారణంగా శనివారం శని దేవునికి అంకితం చేయబడింది. శని ఇనుముకు సంబంధించింది. కాబట్టి శనివారం నాడు బంగారం కొనడం వల్ల ఇంటికి పేదరికం వస్తుందని నమ్ముతారు. అంతేకాదు శనివారం బంగారం కొనడం వల్ల లక్ష్మి, భాగ్య దేవతలు కోపిస్తారట. దానివల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శనివారం బంగారం కొనకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.