Dussehra 2025:దసరా నాడు ఇంట్లో ఈ పరిహారాలు చేయండి చాలు, మీకు డబ్బు కష్టాలే రావు
దసరాను (Dussehra) చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించుకుంటాం.ఇది ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుంది. దుర్గాదేవి ఆశీస్సులు మీకు కావాలంటే దసరా నాడు కచ్చితంగా కొన్ని పనులు చేయాలి.

దసరా పండుగ
దసరా పండుగ భారతదేశంలో అతిపెద్ద పండుగ. దుర్గాదేవి మహిషాసురుని చంపి మంచిని గెలిపించినందుకు ఆమె విజయానికి గుర్తుగా నిర్వహించుకుంటాం. మరో పురాణం ప్రకారం శ్రీరాముడు రావణుడిని సంహరించింది కూడా దసరా నాడే. నవరాత్రుల తర్వాత పదవ రోజున వచ్చేదే దశమి. దసరానే విజయదశమి అని పిలుచుకుంటారు. రాక్షస సంహారం మంచిపై చెడుపై మంచి విజయం పనులకు శుభారంభం. ఇలా దశమి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. దసరా పండుగ కోసం భారతదేశమంతా ఎదురుచూస్తూ ఉంటుంది.
నవ దుర్గల రూపాల్లో
ప్రతి ఏటా దసరా పండుగను ఆశ్వాయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రులను నిర్వహించుకుంటారు. 10వ రోజున విజయదశమిగా నిర్వహించుకుంటారు. దీనినే దసరా అని పిలుస్తారు. ఆరోజు శక్తి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించే రోజు ఈ పండుగను నవరాత్రులు శరన్నవరాత్రి అని కూడా పిలుచుకుంటారు. శరదృతువు ఆరంభంలోనే దసరా పండుగ వస్తుంది. అందుకే దీనికి శరన్నవరాత్రి అనే పేరు కూడా వచ్చింది. దసరా ముందు వచ్చే నవరాత్రులను అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తారు. ఒక్కో రోజు ఒక్కో అలంకారాన్ని చేస్తారు. నవరాత్రుల పాటు ఆ దుర్గాదేవిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కుష్మాండ, స్కంధమాత, కాళీమాత, కాత్యాయని, మహా గౌరీ, సిద్ధిధాత్రి ఇలా నవదుర్గలుగా ఆరాధిస్తారు.
శమీ చెట్టును పూజించి
దసరా నాడు దుర్గాదేవి విగ్రహాన్ని లేదా కలశాన్ని పెట్టి పూజించి కుటుంబానికి అదృష్టాన్ని, శ్రేయస్సును అందించాలని కోరుతారు. దసరా నాడు కచ్చితంగా కొన్ని పనులను చేస్తే మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు అనేవి రావు. పురాణాలు చెబుతున్న ప్రకారం శమీ చెట్టును లక్ష్మీదేవి నివాసంగా చెబుతారు. దసరా రోజు మీరు కచ్చితంగా శమీచెట్టును పూజించాలి. శమీ చెట్టు ఆకులను ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పులు తీరుతాయి. మీకు ఆదాయం పెరుగుతుంది. అలాగే దసరా రోజున అపరాజిత దేవిని పూజించడం మరిచిపోవద్దు. మీ ఇంటికి ఉత్తర దిశలో అపరాజిత దేవుడిని పూజించి ఆమెకు కుంకుమను, సింధూరాన్ని, బియ్యాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోయి డబ్బులు విపరీతంగా వస్తాయి. అలాగే మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయం దక్కుతుంది.
ఇలా పూజ చేయండి
దసరా ఎంతో శుభప్రదమైన పండుగ. ఆరోజు బంగారం, వెండి, రాగి, ఇతడి వస్తువులు కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. ఆరోజు మీరు కొని వెండి, బంగారం, రాగి, ఇత్తడి వస్తువులు మీ ఇంటికి లక్ష్మీదేవిని వచ్చేలా చేస్తాయి. ఇంట్లో ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇంట్లోని వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చేలా చేస్తాయి. ఇక నవరాత్రి చివరి రోజున దసరా రోజు కచ్చితంగా కన్యా పూజను చేయాల్సిందే. కన్యా పూజ అంటే చిత్త వయసులో ఉన్న బాలికలకు పిలిచి ఆహారం పెట్టి బహుమతులను అందించాలి. దీన్ని అత్యంత పుణ్యకార్యంగా చెప్పుకుంటారు. బాలికలను పూజించడం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకున్న వారవుతారు. ఆమె భక్తులకు సంపదను, శ్రేయస్సును అందిస్తుంది. అన్ని రకాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది. కన్యా పూజ చేసిన వారికి అన్ని రకాల అదృష్టాలు దక్కుతాయి.
వీటిని పఠించండి
దసరా శ్రీరాముడితో ముడిపడి ఉంది. శ్రీరాముడు విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది దసరానే. కాబట్టి ఆరోజు మీరు తప్పకుండా శ్రీరాముడిని స్మరించాలి. రామచరిత మానస్ పఠించాలి. మీ ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకొచ్చేలా ఈ రెండు పనులు చేస్తాయి. అలాగే లక్ష్మి కుబేరుల ఆశీస్సులను అందిస్తాయి. దసరాను మన దేశమంతా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. ముఖ్యంగా మైసూర్లో జరిగే దసరా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ విదేశాల నుంచి మైసూరు దసరా ఉత్సవాలను చూసేందుకు ఎంతో మంది వస్తారు. మైసూరు మహారాజు కులదైవం అయిన చాముండేశ్వరి దేవిని ఆరోజు గొప్పగా ఆరాధిస్తారు. ఆమెను ఏనుగులపై ఊరేగిస్తారు. ఆ సమయంలో వీధులన్నీ కోలాహాలంగా నిండిపోతాయి. కళా ప్రదర్శనలు చూసేందుకు ఎంతో మంది ప్రజలు బారులు తీరుతారో. మైసూరు రాజభవనం ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ మైసూరు ఏనుగులను చూసేందుకే ప్రత్యేకంగా ఎంతో మంది వస్తారు. ఆరోజు రాజుగారు ఆయుధ పూజలు నిర్వహిస్తారు.