MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Salt Remedy: ఇంటిని ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఎన్ని రకాలుగా మంచిదంటే..

Salt Remedy: ఇంటిని ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఎన్ని రకాలుగా మంచిదంటే..

ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరచుకునే వారు ఎక్కువే. అయితే ఇంటిని శుభ్రపరిచే నీటిలో రసాయనాలని అధికంగా కలుపుతారు. కానీ ఉప్పును (Salt) కలిపి ఇంటికి శుభ్రపరచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 26 2025, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంటిని క్లీన్ చేసుకునే పద్ధతి
Image Credit : Pixabay

ఇంటిని క్లీన్ చేసుకునే పద్ధతి

భారతీయ కుటుంబాలకు ప్రతిరోజూ ఇల్లు శుభ్రం చేసుకోవడం, వాకిలి శుభ్రపరచుకోవడం, ముగ్గులు వేయడం వంటివి అలవాటు ఉంటాయి. అలా చేశాకే వారు ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారు. ముఖ్యంగా కొన్ని వారాల్లో మాత్రం కచ్చితంగా ఇంటిని శుభ్రపరచుకుంటారు. అలాంటప్పుడు బయట దొరికే రసాయనాలు కలిపిన లిక్విడ్ లను నీళ్లలో కలిపి ఇంటికి మాప్ పెడతారు. అలా పెట్టడం వల్ల బ్యాక్టీరియాలు, వైరస్‌లు మరణిస్తాయని అంటారు. అలాంటి లిక్విడ్లను వాడే బదులు ఉప్పుని నీటిలో కలిపి ఫ్లోర్ పై మాప్ పెట్టడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పురాతన ఆచారాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉప్పును వాడడం
Image Credit : Pixabay

ఉప్పును వాడడం

ఉప్పు మన వంటలో భాగం. కొన్ని శతాబ్దాలుగా ఉప్పును శుద్ధి చేసే లక్షణాలు ఉన్న వస్తువు గానే చూస్తున్నారు. కాబట్టి మీరు ఇంటిని శుభ్రపరచుకునేటప్పుడు ఉప్పును వినియోగించడం మర్చిపోవద్దు. బకెట్ నీళ్లలో గుప్పెడు ఉప్పు వేసి బాగా కలపండి. ఆ నీటితో ఇంటిని శుభ్రపరిచేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోనే ప్రతికూల శక్తులను ఆ ఉప్పు గ్రహిస్తుంది. అలాగే మీ చుట్టూ ఉన్న పరిసరాలను శుద్ధి చేస్తుంది. ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఉండేలా చేస్తుంది. ఇంట్లోని సభ్యులు సామరస్యంగా, ఆనందంగా ఉండేలా సహకరిస్తుంది.

35
ప్రతికూల శక్తులు పోయేలా
Image Credit : Pixabay

ప్రతికూల శక్తులు పోయేలా

ముఖ్యంగా గురువారం పూట ఉప్పు కలిపిన నీటితో ఇంటికి మాప్ పెట్టడం మర్చిపోవద్దు. హిందూ సంప్రదాయాల ప్రకారం విష్ణువు, బృహస్పతిలకు గురువారం అంటే ఎంతో ఇష్టం. వారిద్దరే జ్ఞానం, ఆధ్యాత్మికత, శ్రేయస్సును అందిస్తారు. కాబట్టి గురువారం ఇంటిని శుభ్రపరచుకుంటే ఎంతో మంచిది. మీరు ఆ రోజున ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రపరచండి. ప్రతికూల శక్తిని బయటకు పంపించి అదృష్టాన్ని ఆహ్వానించిన వారు అవుతారు. మీ ఇంటికి అంతా శుభమే కలుగుతుంది. అలాగే దైవిక శక్తులను గౌరవించడానికి వారిని ఇంటికి ఆహ్వానించడానికి కూడా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం.

45
ఉప్పులోని గుణాలు
Image Credit : Pixabay

ఉప్పులోని గుణాలు

సైన్స్ పరంగా కూడా ఉప్పు ఆరోగ్యాన్ని శుభ్రతను అందించే పదార్థంగానే గుర్తింపు పొందింది. ఇది సహజ ప్యూరిఫయింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి సహజ క్లెన్సర్ గా పని చేస్తాయి. నీటిలో వేసి ఉప్పును కలిపినప్పుడు అవి క్రిములను బ్యాక్టీరియాలను, దోమలు, ఈగలు వంటి కీటకాలను తొలగించడానికి సహాయపడుతుంది. దీనివల్ల మీరు నివసించే ప్రదేశం శుభ్రపడుతుంది.

55
స్వచ్ఛతకు చిహ్నం
Image Credit : Pixabay

స్వచ్ఛతకు చిహ్నం

శారీరక పరిశుభ్రతకు ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఆధ్యాత్మిక పరిశుభ్రతకు కూడా ఇది అద్భుతమైనది. ప్రతికూల శక్తులను తటస్థీకరించి హానికరమైన శక్తులను ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఇది ఉత్తమంగా ఉంటుంది. అనేక సంస్కృతులలో ఉప్పును స్వచ్ఛతకు, శక్తికి, రక్షణకు సూచికగా భావిస్తారు. ఉప్పునీటితో ఇంటిని శుభ్రపరచడం అనేది ఒక ఆచారంగా మారిపోయింది. కాబట్టి వారానికి ఒకసారి అయినా ఉప్పునీటితో ఇంటిని శుభ్రపరిచేందుకు ప్రయత్నించండి. ఇది ఉత్తమమైన ఫలితాలను కచ్చితంగా ఇస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
ఉప్పు వంటలకే కాదు.. క్లీనింగ్ కు కూడా వాడచ్చు! ఎలాగో తెలుసా?
Recommended image2
Rock salt or regular salt: రాతి ఉప్పు లేదా సాధారణ ఉప్పు.. ఏది వాడితే ప్రమాదకరం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved