Trigrahi Yoga: తుల రాశిలో మూడు గ్రహాల కలయిక... దీపావళి కి ఈ రాశులదే అదృష్టం..!
Trigrahi Yoga: ఈ ఏడాది దీపావళికి జోతిష్యశాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. వ్యాపారానికి, తెలివికి ప్రాతినిధ్యం వహించే గ్రహాల రాజు సూర్యుడు, బుధుడు, కుజుడు అన్నీ తుల రాశిలోకి త్రి గ్రహి యోగాన్ని సృష్టించనుంది.

Zodiac signs
గ్రహాల అరుదైన కలయిక తెస్తే శుభాలను తెస్తుంది.. లేకపోతే సమస్యలను కలిగిస్తుంది. దీపావళి రోజు కూడా మూడు గ్రహాల కలయిక ఏర్పడనుంది. ఈ త్రి గ్రహి యోగం కారణంగా, మూడు రాశులవారు అదృష్టం, ఆర్థిక లాభాలు, పురోగతి సాధిస్తారు. కుటుంబంలో ఎనలేని ఆనందాన్ని పొందుతారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం....
తుల రాశి...
ఈ సంవత్సరం దీపావళి పండగ సమయంలో, తుల రాశివారికి త్రి గ్రహి యోగం బాగా కలిసిరానుంది. ఇది మీకు చాలా ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో తుల రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు, ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. గౌరవం, కీర్తి పెరుగుతుంది. తుల రాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసికంగా.. ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామి కెరీర్ కూడా మెరుగుపడుతుంది. అన్ని వైపుల నుంచి చేతికి డబ్బు అందుతుంది. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల చూస్తారు.
ధనస్సు రాశి...
త్రి గ్రహి యోగం ధనస్సు వారికి వృత్తి, ఆదాయం పరంగా చాలా బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు చూస్తారు. వ్యాపారం చేసే ధనస్సు రాశివారు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. స్టాక్ మార్కెట్లు, లాటరీ ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టుకున్న మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది.
మకర రాశి...
దీపావళి సమయంలో మకర రాశి వారు కెరీర్, వృత్తిలో మంచి పురోగతి సాధించగలరు. వారు ఏ పని చేసినా అందులో విజయం సాధించగలరు. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త అవకాశాలు పొందుతారు. తాము కోరుకున్న ప్రదేశానికి వెళతారు. ప్రభుత్వం ఉద్యోగం లేదా, పోటీ పరీక్షకు సిద్ధమౌతున్న మకర రాశివారికి విజయావకాశాలు కూడా పెరుగుతాయి. తండ్రితో సంబంధం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది.
పైన పేర్కొన్న మూడు రాశులు తుల, ధనుస్సు, మకర రాశిలో మీ రాశి కూడా ఉంటే, ఈ సంవత్సరం దీపావళి సమయంలో మూడు గ్రహాల ప్రత్యేక కలయిక వల్ల ఏర్పడే త్రిగ్రహి యోగం మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ కాలంలో, మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ సంపద, అదృష్టం, ఆనందం , శ్రేయస్సును పెంచుతుంది. ఈ కాలంలో మీ జీవితం స్వర్ణమయం అవుతుంది.