Zodiac signs: దీపావళి రోజున ఏ రాశివారు ఏం దానం చేస్తే, అదృష్టం పెరుగుతుందో తెలుసా?
Zodiac signs: దీపావళి పర్వ దినం సమయంలో, మీ రాశి ప్రకారం కొన్ని రకాల వస్తువులు దానం చేయడం మంచిది. ఈ దానాలు చేయడం వల్ల అదృష్టం , సంపద పెరగడంతో పాటు.. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి.

Zodiac signs
దీపావళి పండగను హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండగలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ పర్వదినం రోజున ఇంటిని దీపాలతో అలంకరించుకోవడంతో పాటు, లక్ష్మీదేవిని పూజిస్తారు. వీటితో పాటు.. దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిదని జోతిష్య శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున మీ రాశి ప్రకారం దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. సంపద కూడా పెరుగుతుంది. మరి, ఏ రాశివారు ఏ వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం....
మేష రాశి....
మేష రాశివారు దీపావళి పండగ రోజున ఏదైనా ఆలయానికి వెళ్లి బెల్లం,ఎర్రటి వస్త్రం, లేదా చీపురు దానం ఇవ్వాలి. వీటిని దానం చేయడం వల్ల మేష రాశివారి జీవితంలో సమస్యలన్నీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలంగా మారుతుంది. సంపద పెరగడంతో పాటు.. ఆస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆనందం కూడా పెరుగుతుంది.
వృషభ రాశి...
దీపావళి పండగ రోజున వృషభ రాశివారు పేదలకు దానం చేయవచ్చు. అది కూడా బియ్యం, చక్కెర, పెరుగు లాంటివి దానం చేయడం మంచిది. ఈ వస్తువులను దానం చేయడం వల్ల వృషభ రాశిలో జన్మించిన వారికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
మిథున రాశి....
దీపావళి పండగ సమయంలో మిథున రాశి వారు బ్రహ్మణులకు ఆకుపచ్చ వస్త్రం లేదా, స్వీట్లు దానం చేయడం మంచిది. ఈ వస్తువులను దానం చేయడం వల్ల మిథున రాశిలో జన్మించిన వారు వృత్తి, వ్యాపార జీవితంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా ఆవులకు పాలు, బియ్యం, తెల్లటి స్వీట్లు లేదా పచ్చ గడ్డిని దానం చేయడం మంచిది. ఈ వస్తువులను దానం చేయడం వల్ల వృషభ రాశిలో జన్మించిన వారి జీవితాల్లో ఆనందం పెరిగే అవకాశం ఉంటుంది.
సింహ రాశి...
దీపాల పండుగ అయిన దీపావళి సందర్భంగా సింహరాశి వారు గోధుమలు, బెల్లం, దుస్తులు లేదా ఆహారాన్ని పేదవారికి దానం చేయడం మంచిది. ఈ వస్తువులను దానం చేయడం ద్వారా, సింహరాశి వారు తమ కొనుగోళ్లకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది.
కన్య రాశి...
ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా కన్య రాశి వారు ఆకుపచ్చ కూరగాయలు, ధాన్యాలు లేదా ఇత్తడి పాత్రలను దానం చేయాలి. ఈ వస్తువులను దానం చేయడం వల్ల కన్య రాశి వారికి సంపద , శ్రేయస్సు బాగా పెరుగుతుంది.
తుల రాశి...
ఈ దీపావళి పండుగ సందర్భంగా తులారాశి వారు పెరుగు లేదా తెల్లటి వస్త్రాన్ని అవసరంలో ఉన్నవారికి దానం చేయాలి. ఈ వస్తువులను దానం చేయడం ద్వారా, తులారాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
వృశ్చికరాశి
వృశ్చికరాశి వారు ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఏదైనా శివాలయంలో బెల్లం, శనగ పిండిని దానం చేయాలి. లేదంటే శివయ్యకు తేనెతో అభిషేకం చేయడం మంచిది. ఈ పనులు చేయడం ద్వారా, వృశ్చిక రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది.
ధనుస్సు రాశి..
ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా, ధనుస్సు రాశి వారు పసుపు వస్త్రం, ఐరన్ తో చేసిన వస్తువులను దానం చేయడం మంచిది. ఈ వస్తువులను దానం చేయడం ద్వారా, ధనుస్సు రాశి వారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంలో విజయం సాధిస్తారు.
మకర రాశి ..
ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా మకర రాశి వారు మినపప్పు, దుప్పటి, ఆవాల నూనె లేదా నువ్వులను దానం చేయడం చాలా శుభప్రదమని చెబుతారు. ఈ వస్తువులను దానం చేయడం వల్ల మకర రాశి వారు జీవితాల్లో ఆనందం , శాంతి పెరుగుతాయి.
కుంభ రాశి...
కుంభ రాశి వారు ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఏదైనా ఆలయానికి ఆకుపచ్చ కూరగాయలు లేదా ఎర్రటి పూలను దానం చేయాలి. ఈ వస్తువులను దానం చేయడం వల్ల కుంభ రాశి వారి జీవితాల్లోని అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
మీన రాశి...
ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా, మీన రాశి వారు బియ్యం, శెనగ పిండి, పసుపు రంగు స్వీట్లు లేదా దుప్పట్లు పేదలకు దానం చేయడం శుభప్రదం. ఈ వస్తువులను దానం చేయడం వల్ల మీన రాశి వారి జీవితంలో డబ్బు , సంపదకు సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి.