Dream: ఇలాంటి కలలు ఎవరికీ చెప్పొద్దు.. ఎవరికైనా చెప్పారో.. ఇక అంతే..!
Dream: నిద్రలో మనకు వచ్చే ప్రతి కలకు ఒక లోతైన అర్థం ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలు మన భవిష్యత్తు, మన మానసిక స్థితి, మన జీవితంలో జరుగుతున్న సంఘటనల గురించి సూచిస్తాయి.

Dream
రాత్రిపూట నిద్రలో కలలు రావడం చాలా సహజం. కొన్ని కలలు మనకు ఆనందాన్ని, శాంతిని కలిగిస్తాయి. మరి కొన్ని భయాన్ని లేదా ఆందోళనను కలిగిస్తాయి. చాలా మంది తమకు వచ్చిన కలల గురించి వెంటనే అందరితో పంచుకుంటారు. కానీ, కొన్ని కలలను గోప్యంగా ఉంచుకోవడమే మంచిది.లేకపోతే మీరే సమస్యల్లో పడతారని స్వప్నశాస్త్రం చెబుతోంది. మరి.. ఎలాంటి కలలు పంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...
దేవుడు కలలో కనిపిస్తే...
మీరు కలలో ఏదైనా గుడికి వెళ్లినట్లు కనిపించినా లేదా.. దేవుడు, దేవతలను చూసినట్లు కలగంటే, అలాంటి కలను శుభ సూచికంగా పరిగణిస్తారు. అటువంటి కలలు ఆధ్యాత్మిక పురోగతిని, రాబోయే సంపదను సూచిస్తాయి. ఇలాంటి కలలను ఎవరితో అయినా పంచుకుంటే.. మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది. అందుకే.. ఈ కలలను పంచుకోకూడదు.
ప్రకృతికి సంబంధించిన కలలు...
కలలో పచ్చని అడవులు, పర్వతాలు, ప్రవహించే నదులు, జలపాతాలు, అందమైన తోటలను చూడటం భవిష్యత్తులో ఆనందం, శాంతి లభిస్తాయి. త్వరలో శుభవార్తలు వినే అవకాశం ఉందని అర్థం. ఇవి కూడా చాలా మంచి కలలు. వీటిని కూడా ఇతరులకు చెప్పకూడదు. దీని వల్ల మీరు వినాల్సిన శుభవార్తలు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి.. వీటిని చాలా సీక్రెట్ గా ఉంచాలి.
మరణానికి సంబంధించిన కలలు...
కలలో ఎవరైనా చనిపోయినట్లు కనిపిస్తే.. అందరూ భయపతారు. కానీ.. ఇది కూడా మంచి కల అని స్వప్న శాస్త్రం చెబుతోంది. మీ జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తీరిపోతాయని ఈ కల చెబుతోంది. ఈ కల ఎవరితోనైనా పంచుకుంటే.. తగ్గాల్సిన మీ సమస్యలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. కుటుంబంలో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
ఆస్తికి సంబంధించిన కలలు
మీరు డబ్బు అందుకున్నట్లు, నిధిని కనుగొన్నట్లు లేదా కొత్త వస్తువును కొనుగోలు చేసినట్లు కలగంటే, అది ఆర్థిక పురోగతికి సంకేతం. ఇలాంటి కలలు భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుందని సూచిస్తాయి. అయితే, ఈ కలలను ఇతరులతో పంచుకోవడం వల్ల మీ ఆర్థిక లాభ అవకాశాలు బలహీనపడి, మీ ఆర్థిక పురోగతికి ఆటంకం కలగవచ్చు. కాబట్టి.. ఈ కలలు కూడా పంచుకోవద్దు.

