MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Moon Transit: మిథున రాశిలో చంద్రుడు.. ఈ 4 రాశులవారికి డబ్బుతో పాటు ప్రశాంతత!

Moon Transit: మిథున రాశిలో చంద్రుడు.. ఈ 4 రాశులవారికి డబ్బుతో పాటు ప్రశాంతత!

Moon Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనసు, సంపదకు కారకుడైన చంద్రుడు నేడు (జూన్ 15వ తేదీ) మిథున రాశిలోకి ప్రవేశించాడు. మరో రెండు రోజుల వరకు అదే రాశిలో సంచరిస్తాడు. చంద్రుడి సంచారం వల్ల 4 రాశుల వారి అదృష్టం పూర్తిగా మారిపోతుంది. ఆ రాశులేవో చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Jun 15 2026, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : our own

వృషభ రాశి

వృషభ రాశివారికి చంద్రుడి సంచారం వల్ల మంచి రోజులు వస్తాయి. మీ జీవితంపై సానుకూల ప్రభావం పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. ఈ సమయంలో మీ కెరీర్ మెరుగుపడుతుంది. వ్యాపారం చక్కగా వృద్ధి చెందుతుంది. ఊహించని కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : our own

మిథున రాశి

మిథున రాశివారికి చంద్రుడి సంచారం సానుకూల ఫలితాలనిస్తుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలాకాలంగా ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా డబ్బు కొరత తీరి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. 

34
కర్కాటక రాశి
Image Credit : our own

కర్కాటక రాశి

కర్కాటక రాశివారు చంద్రుడి సంచార సమయంలో మానసిక ప్రశాంతతను పొందుతారు. పాత అప్పుల నుంచి విముక్తి పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఊహించని సంపద కూడబెట్టుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. వారితో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు.

44
కన్య రాశి
Image Credit : our own

కన్య రాశి

చంద్రుడి సంచారం కన్య రాశివారికి మంచి రోజులను తీసుకువస్తుంది. జీవితంలో మంచి మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీరు కోరుకున్నది జరుగుతుంది. బంధువులతో ఉన్న సమస్యలు తొలగిపోయి.. అంతా ఒక్కటవుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు దక్కుతుంది. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జాగ్రత్త.. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు!
Recommended image2
Birth Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే.. అదృష్టం రెట్టింపు అవుతుంది..!
Recommended image3
Birth Stars: ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు భర్తను ప్రాణంగా ప్రేమిస్తారు!
Related Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఏ రాశివారికి ఏ విషయాల్లో కలిసివస్తుందో చూడండి!
Recommended image2
Dream Meaning: కలలో Ex లవర్ కనిపిస్తే అర్థం ఏంటి? మనసు ఇంకా వారినే కోరుకుంటున్నట్లా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved