MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Dream Meaning: తెల్లవారు జామున కలలో ఇవి కనిపిస్తే... ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు రావడం ఖాయం

Dream Meaning: తెల్లవారు జామున కలలో ఇవి కనిపిస్తే... ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు రావడం ఖాయం

 Dream Meaning: మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందుగానే సూచించే శక్తి కలలకు ఉంది. స్వప్న శాస్త్రం ప్రకారం మనకు ఉదయాన్నే వచ్చే కలలు నిజమౌతాయని నమ్ముతారు. ఇదే కలలో కొన్ని వస్తువులు కనపడితే ఆర్థిక లాభాలు కలుగుతాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 03 2026, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Dream
Image Credit : Chat gpt

Dream

మన జీవితంలో లేదా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవడం అంత సులువు కాదు. అయితే, స్వప్న శాస్త్రం దీనికి సంబంధించిన సూచనలు మనకు అందిస్తోంది. ప్రతిరోజూ రాత్రిపూట నిద్రపోగానే.. ఏదో ఒక కల రావడం చాలా సహజం. ప్రతి కలకీ ఒక అర్థం ఉంటుంది. అంతేకాదు.. ముఖ్యంగా మన కలలో కనిపించే కొన్ని వస్తువులు మనకు అదృష్టాన్ని తెస్తాయో, సమస్యలను తెస్తాయో తెలిసుకోవచ్చు. మరి, ఎలాంటి వస్తువులు కలలో కనపడితే ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు అందుతుందో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.ధాన్యం, పప్పులు...
Image Credit : Getty

1.ధాన్యం, పప్పులు...

స్వప్న శాస్త్రం ప్రకారం, మీ కలలో మీరు ధాన్యం లేదా పప్పులను చూసినట్లయితే, మీ ఆర్థిక సమస్యలు త్వరలో తగ్గిపోతాయని అర్థం. ధాన్యం గురించి వచ్చే కలలు ఆర్థిక సమస్యల పరిష్కారానికి సంకేతంగా భావిస్తారు. మీకు తెల్లవారు జామున వచ్చే కలలో బియ్యం, పప్పులు ఏవి కనిపించినా.. మీకు వచ్చే రోజుల్లో ఏదో ఒక రూపంలో డబ్బులు చేతికి అందే అవకాశం ఉంది.

2.తామర పువ్వు...

స్వప్నశాస్త్రం ప్రకారం.. మీకు తెల్లవారు జామున వచ్చే కలలో తామర పువ్వు కనపడితే, సాక్షాత్తు లక్ష్మీదేవి మీపై తన అనుగ్రహం కురిపిస్తోందని అర్థం. ఆమె ఆశీస్సులు మీపై ఉన్నాయని ఇది సూచిస్తుంది. ఇలాంటి కలను చాలా శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. డబ్బు ఇంటికి చేరడమే కాకుండా, కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా పెరుగుతాయి.

33
  3.బంగారం, వెండి..
Image Credit : Chat Gpt

3.బంగారం, వెండి..

మీ కలలో బంగారం లేదా వెండిని చూడటం, ఆ లోహాలతో చేసిన ఆభరణాలను చూడటం ఆర్థిక లాభానికి సంకేతంగా భావిస్తారు. మీరు తెల్లవారుజామున కలలో బంగారం, వెండి ఆభరణాలు కనపడితే, మీ బ్యాంకు ఖాతాలో డబ్బు రెట్టింపు అవుతుంది. జీతం పెరుగుతుంది. వ్యాపారాల నుంచి కూడా లాభాలు వస్తాయి.

4.వెలుగుతున్న దీపం...

మీకు ఎప్పుడైనా తెల్లవారుజామున వెలుగుతున్న దీపం గురించి కల వస్తే, అది అత్యంత శుభప్రదమైన కలగా పరిగణిస్తారు. ఇది మీకు అనేక విధాలుగా శుభ ఫలితాలను చేకూర్చగలదు. జీవితంలో చీకటి పోయి.. వెలుగులు వస్తాయి. అనుకోని విధంగా మీ చేతికి డబ్బులు వస్తాయి.

5.నీటితో నిండిన కుండ..

మీ కలలో నీటితో నిండిన పాత్రను చూడటం కూడా అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఒకవేళ మీరు మీ కలలో నీటి పాత్రను లేదా నీటితో నిండిన కుండను చూసినట్లయితే, అది మీకు ఆర్థికపరమైన పురోగతి లభించబోతోందని సూచిస్తుంది. ఆదాయం రోజు రోజుకీ పెరుగుతుందని ఈ కల సూచిస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Jupiter Transit: పునర్వసు నక్షత్రంలోకి గురుడు.. ఐదు రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్లే..!
Recommended image2
Venus Moon Conjunction: రెండు గ్రహాల అరుదైన కలయిక...ఈ రాశులకు ఊహించని ఆర్థిక లాభాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved