Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 15.06.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
మిథున రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. వ్యాపారులకు అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. నూతన వాహన యోగం ఉంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
ఉద్యోగాలలో అధికారులతో చర్చల్లో పురోగతి కలుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
సింహ రాశి ఫలాలు
ఇంటా బయటా చిన్నపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో తోటివారితో మాటపట్టింపులు కలుగుతాయి.
కన్య రాశి ఫలాలు
డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
తుల రాశి ఫలాలు
పాత అప్పులు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.
మకర రాశి ఫలాలు
అవసరానికి సహాయం అందక ఇబ్బందిపడతారు. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.
కుంభ రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.
మీన రాశి ఫలాలు
ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తికావు. వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

