Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 07.01.2025 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు.
వృషభ రాశి ఫలాలు
ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథున రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు మరింత చికాకు తెప్పిస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
సింహ రాశి ఫలాలు
వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తొలగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య రాశి ఫలాలు
నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు వస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
ఉద్యోగులు ఉన్నత అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి ఫలాలు
సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. ఉద్యోగుల పనికి తగిన గుర్తింపు లభించదు. ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తికావు.
ధనుస్సు రాశి ఫలాలు
బంధుమిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేస్తారు.
మకర రాశి ఫలాలు
ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.
కుంభ రాశి ఫలాలు
చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాదు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో తో చిన్నపాటి సమస్యలు తప్పవు.
మీన రాశి ఫలాలు
నూతన వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి.

