Today Rasi Phalalu: ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 6.07.2025 ఆదివారానికి సంబంధించినవి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పిల్లల చదువు విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుంచి సహాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నివైపుల నుంచి ఆదాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉంది.
మిథున రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాల్లో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది.
కర్కాటక రాశి ఫలాలు
కుటుంబానికి సంబంధించి కీలక ఆలోచనలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి.
సింహ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాల్లో కష్టానికి తగిన గుర్తింపు ఉండదు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
కన్య రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉన్నా నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. పాత అప్పులు తీర్చుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం ఉంటుంది. దూర ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
పిల్లల చదువు విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సౌకర్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
ధనుస్సు రాశి ఫలాలు
ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం దక్కదు.
మకర రాశి ఫలాలు
డబ్బు పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు.
కుంభ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.
మీన రాశి ఫలాలు
డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తిచేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.