Today Rasi Phalalu: ఈ రాశివారు బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 05.06.2025 గురువారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
నూతన వస్తు, వాహన లాభాలు పొందుతారు. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల ద్వారా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి.
వృషభ రాశి ఫలాలు
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వల్ల ఖర్చులు పెరుగుతాయి.
మిథున రాశి ఫలాలు
కుటుంబ విషయాల్లో మాట పట్టింపులు తొలగుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
సింహ రాశి ఫలాలు
దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
కన్య రాశి ఫలాలు
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదమ్ములతో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
తుల రాశి ఫలాలు
నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధు మిత్రుల నుంచి సాయం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా మాటలు పడాల్సి వస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వాహన ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి.
మకర రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు రావచ్చు. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.
మీన రాశి ఫలాలు
అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.