Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 30.03.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటి వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు.
వృషభ రాశి ఫలాలు
సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.
మిథున రాశి ఫలాలు
దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది.
కర్కాటక రాశి ఫలాలు
దూర ప్రయాణాలు అనుకూలం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
సింహ రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికావు. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. నిరుద్యోగులకు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కన్య రాశి ఫలాలు
దూరప్రాంత బంధు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
తుల రాశి ఫలాలు
అన్ని వైపుల నుంచి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలలో ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు. ఉద్యోగాలు అనుకూలం.
వృశ్చిక రాశి ఫలాలు
ఇంటా బయటా ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఇబ్బందులుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మకర రాశి ఫలాలు
చుట్టుపక్కలవారితో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో స్థిరత్వం కలుగుతుంది.
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయటా విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు అందుతాయి.
మీన రాశి ఫలాలు
సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

