MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Shani Mangal Yoga: 5 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి డబ్బుల వర్షమే!

Shani Mangal Yoga: 5 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి డబ్బుల వర్షమే!

జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. త్వరలో శని, కుజ గ్రహాల కలయిక జరగనుంది. దానివల్ల శని-మంగళ యోగం ఏర్పడనుంది. ఇది 5 రాశులవారిపై నేరుగా ప్రభావం చూపనుంది. వారి జీవితాల్లో ఊహించని అదృష్టాన్ని తీసుకురానుంది. ఆ రాశులేవో చూద్దామా

2 Min read
Author : Kavitha G
Published : Mar 28 2026, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మీన రాశిలో శని మంగళ యోగం
Image Credit : Asianet News

మీన రాశిలో శని-మంగళ యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడిని కోపం, యుద్ధం, ఆగ్రహానికి ప్రతీకగా చెప్తారు. శనిని కర్మఫలదాతగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు ఏప్రిల్ 2న మీన రాశిలో కలవనున్నాయి. కుజుడు, శనితో కలవడం వల్ల శని-మంగళ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఐదు రాశులపై నేరుగా ప్రభావం చూపతుంది. ఆ రాశులేవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారి 11వ ఇంట్లో శని-కుజుల కలయిక జరుగుతుంది. ఈ యోగంతో వీరు ఆర్థికంగా లాభపడతారు. కెరీర్‌లో ఎదుగుదల కనిపిస్తుంది. స్నేహితులతో బంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అయితే సంబంధాలకు విలువ ఇవ్వడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

36
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారి 10వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల మీరు చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ప్రత్యేకంగా లాభాలుంటాయి. అయితే ధైర్యంగా, సరైన సమయంలో కొత్త పనులను మొదలుపెట్టాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ దక్కుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

46
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి 8వ ఇంట్లో శని-మంగళ యోగం ఏర్పడుతుంది. ఈ యోగంతో డబ్బు కష్టాలు, అనారోగ్య సమస్యలు, శత్రువుల బెడద తొలగిపోతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కానీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దానివల్ల భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

56
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

తుల రాశి వారికి 6వ ఇంట్లో శని- కుజుల కలయిక జరుగుతుంది. దీనివల్ల సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఓపికతో చేసే పనుల్లో విజయం దక్కుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

66
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశి వారికి 2వ ఇంట్లో శని-కుజుల సంయోగం జరుగుతుంది. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ, వ్యాపారాలు విపరీతంగా కలిసివస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అయితే, ఈ సమయంలో మీ మాటల మీద నియంత్రణ ఉండాలి. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు అందరితో చర్చించి తీసుకోవడం మంచిది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు డబ్బు సంపాదించడంలో టాప్.. మీ రాశి ఉందా?
Recommended image2
Birth Month: ఏ నెలలో పుట్టినవారు ఏ నెలలో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved