MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. ఉద్యోగంలో ప్రమోషన్స్!

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. ఉద్యోగంలో ప్రమోషన్స్!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 29.05.2025 గురువారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : May 29 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితుల సహాయంతో కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి రావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు శని దయతో 40 ఏళ్ల తర్వాత చాలా డబ్బు సంపాదిస్తారు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. మిత్రులతో మాట పట్టింపులు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణం. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూలం.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Venus Conjunction: 30 ఏళ్ల తర్వాత అద్భుతం.. శని, శుక్రుల దయతో ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!
Recommended image2
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ రాశుల తలరాత మారిపోతుంది, పట్టిందల్లా బంగారమే..!
Recommended image3
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కోడ‌లిగా వ‌స్తే.. ఆ ఇంటి అదృష్టం మారిన‌ట్లే
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు శని దయతో 40 ఏళ్ల తర్వాత చాలా డబ్బు సంపాదిస్తారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved