Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు శని దయతో 40 ఏళ్ల తర్వాత చాలా డబ్బు సంపాదిస్తారు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని.. సమస్యలే కాదు కొందరికీ అదృష్టాన్ని కూడా తీసుకువస్తాడట. కొన్ని తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రత్యేక అనుగ్రహం చూపిస్తాడట. మొదట్లో కష్టాలు పెట్టినా 40 ఏళ్ల తర్వాత మంచి ఫలితాలను ఇస్తాడట. మరి ఆ తేదీలెంటో చూద్దామా…

మూల సంఖ్య 8
సంఖ్యా శాస్త్రం ప్రకారం శనికి ఇష్టమైన సంఖ్య 8. మూల సంఖ్య 8 కి అధిపతి శని దేవుడు. కాబట్టి ఈ మూలసంఖ్య కలిగిన వారిపై శని.. ప్రత్యేక అనుగ్రహం చూపిస్తాడు. ఏ నెలలో అయినా 8, 17 లేదా 26వ తేదీల్లో జన్మించిన వ్యక్తులు 8 మూల సంఖ్యను కలిగి ఉంటారు. వీరు శని ప్రభావం వల్ల నిజాయతీగా ఉంటారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. కష్టపడేతత్వం వీరి సొంతం.
మొదట్లో కష్టాలు..
ఈ తేదీల్లో పుట్టిన వారిని.. శని దేవుడు మొదట్లో చాలా కష్టాలు పెడతాడట. ఈ వ్యక్తుల ప్రారంభ జీవితం చాలా కష్టాలతో నిండి ఉంటుందట. కానీ కొంతకాలం తర్వాత శని దేవుడు వారికి మంచి ఫలితాలను ఇస్తాడట.
40 ఏళ్ల తర్వాత
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి.. శని దేవుడు 40 సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని ఇస్తాడట. ఒక్కసారిగా వారి జీవితం మారిపోతుందట. ఎప్పుడూ చూడని డబ్బు, కీర్తి సంపాదిస్తారట.
వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే?
ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రశాంత స్వభావం, మంచి మనసు కలిగి ఉంటారు. దీంతో పాటు వారు మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఈ వ్యక్తులు తత్వ శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుంటారు. వీరి జీవితంలో అద్భుతాలు తరచుగా జరుగుతాయి. వారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.