Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 27.03.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. మిత్రులతో ఊహించని వివాదాలు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
మిథున రాశి ఫలాలు
కొత్తగా అప్పులు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య ససమ్యలు చికాకు కలిగిస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటక రాశి ఫలాలు
ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
సింహ రాశి ఫలాలు
నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
కన్య రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చిక రాశి ఫలాలు
చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల రాక ఆనందం కలిగిస్తుంది.
ధనుస్సు రాశి ఫలాలు
ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మకర రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
కుంభ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
మీన రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూ వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

