MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Birth Month: ఏ నెలలో పుట్టినవారు ఏ నెలలో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారో తెలుసా?

Birth Month: ఏ నెలలో పుట్టినవారు ఏ నెలలో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారో తెలుసా?

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు మనసులు, రెండు స్వభావాలు, రెండు జీవితాల కలయిక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ నెలలో పుట్టినవారు ఏ నెలలో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారో తెలుసా? మరి ఆలస్యమెందుకు తెలుసుకుందాం పదండి.  

2 Min read
Author : Kavitha G
Published : Mar 25 2026, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Birth Month Compatibility
Image Credit : Asianet News

Birth Month Compatibility

ఒక వ్యక్తి జీవితంలో పెళ్లి ముఖ్యమైన మలుపు. ఇద్దరు వ్యక్తులు కలిసి బంధం సాఫీగా సాగించాలంటే అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వ్యక్తి పుట్టిన నెల వారి స్వభావం, ఆలోచనా విధానం, భావోద్వేగాలు, సంబంధాలపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని నెలల్లో పుట్టినవారు, కొన్ని ప్రత్యేక నెలల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉంటారట. మరి ఏ నెలలో పుట్టినవారు, ఏ నెలలో పుట్టినవారిని పెళ్లి చేసుకోవాలో తెలుసుకుందామా…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో పుట్టినవారు
Image Credit : Gemini AI

జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో పుట్టినవారు

జనవరి నెలలో పుట్టినవారు సాధారణంగా బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తులు. వీరికి జూన్ లేదా సెప్టెంబర్ నెలలో పుట్టినవారు మంచి జోడీ అవుతారు. ఎందుకంటే ఈ నెలల్లో పుట్టినవారు సహనం, అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు.

ఫిబ్రవరి నెలలో పుట్టినవారు భావోద్వేగపరులు, క్రియేటివ్ గా ఉంటారు. వీరికి మే లేదా నవంబర్ నెలలో పుట్టినవారు సరిపోతారని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీరు స్థిరత్వాన్ని తీసుకువస్తారు. 

మార్చి నెలలో పుట్టినవారు సున్నిత మనస్కులు, కలల ప్రపంచంలో జీవించే వారు. వీరికి ఆగస్టు లేదా డిసెంబర్ నెలలో పుట్టినవారు సరైన భాగస్వాములు అవుతారని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే వారు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు.

35
ఏప్రిల్, మే, జూన్ నెలలో పుట్టినవారు
Image Credit : Getty

ఏప్రిల్, మే, జూన్ నెలలో పుట్టినవారు

ఏప్రిల్ నెలలో పుట్టినవారు ఉత్సాహంగా, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి జూలై లేదా అక్టోబర్ నెలలో పుట్టినవారు మంచి మ్యాచ్ అవుతారు. ఎందుకంటే వీరు సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. 

మే నెలలో పుట్టినవారు స్థిరంగా, నిశ్చయంగా ఉండే వ్యక్తులు. వీరికి ఫిబ్రవరి లేదా ఆగస్టు నెలలో పుట్టినవారు సరిపోతారని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే వీరు భావోద్వేగపరంగా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. 

జూన్ నెలలో పుట్టినవారు మంచి మాటకారులు, చురుకుగా ఉంటారు. వీరికి జనవరి లేదా అక్టోబర్ నెలలో పుట్టినవారు సరైన జోడీ అవుతారు. ఎందుకంటే వీరు స్థిరత్వాన్ని ఇస్తారు.

45
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పుట్టినవారు
Image Credit : Getty

జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పుట్టినవారు

జూలై నెలలో పుట్టినవారు కుటుంబాన్ని ప్రేమించే వారు, భావోద్వేగపరులు. వీరికి మార్చి లేదా ఏప్రిల్ నెలలో పుట్టినవారు సరిపోతారని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే వీరు జీవితంలో ఉత్సాహాన్ని తీసుకువస్తారు. 

ఆగస్టు నెలలో పుట్టినవారు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉంటారు. వీరికి మే లేదా డిసెంబర్ నెలలో పుట్టినవారు సరిపోతారని పండితులు సూచిస్తున్నారు.

సెప్టెంబర్ నెలలో పుట్టినవారు విశ్లేషణాత్మకంగా, శ్రద్ధగా ఉంటారు. వీరికి జనవరి లేదా జూన్ నెలలో పుట్టినవారు సరైన భాగస్వాములు అవుతారు.

55
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో పుట్టినవారు
Image Credit : Getty

అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో పుట్టినవారు

అక్టోబర్ నెలలో పుట్టినవారు బ్యాలెన్స్డ్ గా ఉంటారు. సంబంధాలకు విలువిస్తారు. వీరికి ఏప్రిల్ లేదా జూలై నెలలో పుట్టినవారు మంచి మ్యాచ్ అవుతారు.

నవంబర్ నెలలో పుట్టినవారు గాఢమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. కొంచెం రహస్య స్వభావం కలిగి ఉంటారు. వీరికి ఫిబ్రవరి లేదా మే నెలలో పుట్టినవారు సరిపోతారని పండితులు చెబుతున్నారు.

డిసెంబర్ నెలలో పుట్టినవారు ఉత్సాహంగా ఉంటారు, స్వేచ్ఛను ఇష్టపడతారు. వీరికి మార్చి లేదా ఆగస్టు నెలలో పుట్టినవారు మంచి జోడీ అవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Saturn Rise: శని ఉదయం.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Sun Saturn Conjunction: రెండు శత్రు గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి చుక్కలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved