MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ 2 రాశులవారు డబ్బు విషయంలో ఇతరులకు మాటివ్వడం మంచిది కాదు!

Today Rasi Phalalu: నేడు ఈ 2 రాశులవారు డబ్బు విషయంలో ఇతరులకు మాటివ్వడం మంచిది కాదు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 24.06.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jun 24 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ఎమోషనల్ పర్సన్స్.. ఒక్కసారి కనెక్ట్ అయితే వదిలిపెట్టరు!
Related image2
Mars Blessings: కుజుడి దయతో ఈ 5 రాశులవారికి చేతినిండా డబ్బులే! మీ రాశి ఉందేమో చూడండి
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

డబ్బు విషయంలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి, వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటా బయటా కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పాత అప్పులు తీర్చగలుగుతారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

సంతానానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిర్ణయాలు కలిసివస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి, ద్యోగాలలో మీ కష్టం వృథాగా మిగులుతుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. డబ్బు పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి వృత్తి, యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. డబ్బు విషయాల్లో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వల్ల మానసిక ఇబ్బందులు తప్పవు. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ఎమోషనల్ పర్సన్స్.. ఒక్కసారి కనెక్ట్ అయితే వదిలిపెట్టరు!
Recommended image2
Shatanka Yogam: బుధ, శని గ్రహాల శతాంక యోగం.. 5 రాశులకు రెట్టింపు ఆదాయం, డబ్బే డబ్బు..!
Recommended image3
Surya Gochar: పుష్య నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారు ఏ పనిచేసిన సక్సెస్ అవుతుంది
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ఎమోషనల్ పర్సన్స్.. ఒక్కసారి కనెక్ట్ అయితే వదిలిపెట్టరు!
Recommended image2
Mars Blessings: కుజుడి దయతో ఈ 5 రాశులవారికి చేతినిండా డబ్బులే! మీ రాశి ఉందేమో చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved