MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ఎమోషనల్ పర్సన్స్.. ఒక్కసారి కనెక్ట్ అయితే వదిలిపెట్టరు!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ఎమోషనల్ పర్సన్స్.. ఒక్కసారి కనెక్ట్ అయితే వదిలిపెట్టరు!

Birth Date: జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారు చాలా ఎమోషనల్‌గా, సున్నితంగా ఉంటారు. వీరు ప్రేమ, బంధాలకు చాలా విలువిస్తారు. ఒక్కసారి కనెక్ట్ అయితే అస్సలు వదిలిపెట్టరు. మరి ఆ తేదీలేంటో తెలుసుకుందామా..

2 Min read
Author : Kavitha G
Published : Jun 23 2026, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏ తేదీల్లో పుట్టినవారు ఎమోషనల్ పర్సన్స్?
Image Credit : Getty

ఏ తేదీల్లో పుట్టినవారు ఎమోషనల్ పర్సన్స్?

జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి పుట్టిన తేదీ అతని స్వభావం, ఎమోషన్స్, సంబంధాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టినవారు చాలా లోతైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. వారు ప్రేమ, అనుబంధాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అలాంటి వ్యక్తులు ఒకసారి ఎవరి మీదైనా నమ్మకం లేదా ప్రేమ పెంచుకుంటే, ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. ఏ తేదీల్లో పుట్టినవారు ఇలా ఉంటారో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2వ తేదీన పుట్టినవారు
Image Credit : Asianet News

2వ తేదీన పుట్టినవారు

ఏ నెలలో అయినా 2వ తేదీ పుట్టినవారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఎదుటివారి చిన్న మాట, చిన్న ప్రవర్తన కూడా వీరిని లోతుగా ప్రభావితం చేస్తుంది. కానీ ఇదే సున్నితత్వం వీరి ప్రేమను చాలా నిజాయతీగా, గాఢంగా మార్చుతుంది. ఒకసారి ఎవరినైనా నమ్మితే, ఆ వ్యక్తిని పూర్తిగా మనసులోకి తీసుకుంటారు. సంబంధాల్లో వీరు చాలా నమ్మకంగా ఉంటారు. విడిపోవడం అంటే వీరికి చాలా కష్టం.

35
6వ తేదీన జన్మించినవారు
Image Credit : Stockphoto

6వ తేదీన జన్మించినవారు

ఏ నెలలో అయినా 6వ తేదీ పుట్టినవారు ప్రేమ, కుటుంబం, అనుబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. ఒకసారి ఎవరికైనా దగ్గరైతే, ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారు. వీరు ప్రేమను కేవలం భావనగా కాకుండా బాధ్యతగా చూస్తారు. అందుకే వీరితో బంధం చాలా బలంగా ఉంటుంది. కానీ ఎక్కువ ఎమోషనల్ పర్సన్ కావడం వల్ల చిన్న నిర్లక్ష్యం కూడా వీరిని లోతుగా బాధపెడుతుంది.

45
7వ తేదీన పుట్టినవారు
Image Credit : Getty

7వ తేదీన పుట్టినవారు

ఏ నెలలో అయినా 7వ తేదీ పుట్టినవారు అంతర్ముఖ స్వభావం కలిగి ఉంటారు. ఎక్కువగా ఆలోచిస్తారు. వీరు బయటకు ఎక్కువగా భావాలను చూపించకపోయినా, లోపల మాత్రం చాలా లోతుగా ఫీల్ అవుతారు. ఒకసారి ఎవరితోనైనా కనెక్ట్ అయితే, ఆ సంబంధాన్ని చాలా జాగ్రత్తగా, బాధ్యతగా నిలబెట్టుకుంటారు. వీరి నమ్మకం పొందడం కష్టం కానీ.. ఒకసారి నమ్మకం ఏర్పడితే, అది చాలా బలంగా ఉంటుంది.

55
11వ తేదీన జన్మించినవారు
Image Credit : stockPhoto

11వ తేదీన జన్మించినవారు

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 11వ తేదీ పుట్టినవారు చాలా ప్రత్యేకమైన భావోద్వేగ శక్తి కలిగి ఉంటారు. వీరు చాలా సెన్సిటివ్ కూడా. వీరు ఎదుటివారి భావాలను సులభంగా అర్థం చేసుకుంటారు. చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించే స్వభావం వీరిది. ఒకసారి ఎవరితో అయినా ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడితే, ఆ వ్యక్తిని తమ జీవితంలో చాలా ముఖ్యమైన స్థానంలో ఉంచుతారు. వీరు ప్రేమలో చాలా డీప్‌గా వెళ్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Mars Blessings: కుజుడి దయతో ఈ 5 రాశులవారికి చేతినిండా డబ్బులే! మీ రాశి ఉందేమో చూడండి
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారిలో ఏదో తెలియని పవర్ ఉంటుంది.. అదే వారి బలం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved