MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 23.01.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jan 23 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. డబ్బు ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.

Related Articles

Related image1
Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. త్వరలో కోటీశ్వరులు కావడం ఖాయం!
Related image2
Birth Stars: ఈ 6 నక్షత్రాల్లో పుట్టినవారికి పెళ్లి తర్వాత అదృష్టం, సంపద రెట్టింపవుతుంది!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

నూతన వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయటా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

విద్యార్థులు అంచనాలు అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోతారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ఇంట్లో కొందరి ప్రవర్తన తలనొప్పి తెప్పిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో శ్రమ పెరుగుతుంది. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీ విలువ మరింత పెరుగుతుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆరోగ్యం అంతగా సహకరించదు. డబ్బు పరమైన చికాకులు పెరుగుతాయి. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అప్పుల నుంచి ఉపశమనం.. నిరుద్యోగుల కలలు సాకారం!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు మాట విలువ పెరుగుతుంది
Recommended image3
Venus Transit:భాద్రపద నక్షత్రంలోకి శుక్రుడు...ఈ రాశులవారు బంపర్ లాటరీ కొట్టినట్లే..!
Related Stories
Recommended image1
Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. త్వరలో కోటీశ్వరులు కావడం ఖాయం!
Recommended image2
Birth Stars: ఈ 6 నక్షత్రాల్లో పుట్టినవారికి పెళ్లి తర్వాత అదృష్టం, సంపద రెట్టింపవుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved