MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 23.12.2025 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Dec 23 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

Related Articles

Related image1
Birth Stars: ఈ నక్షత్రాలో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. వీరిని పట్టుకోవడం చాలా కష్టం!
Related image2
Zodiac Signs: ఈ 4 రాశులవారిపై శని దేవుడికి ప్రేమ ఎక్కువ.. కష్టాలు వీరి దరిదాపుల్లోకి కూడా రావు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో తోటివారి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వృథా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిన్నపాటి చికాకులు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా కలిసివస్తుంది!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు శుభవార్తలు వింటారు
Recommended image3
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాలో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. వీరిని పట్టుకోవడం చాలా కష్టం!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారిపై శని దేవుడికి ప్రేమ ఎక్కువ.. కష్టాలు వీరి దరిదాపుల్లోకి కూడా రావు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved