Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు వస్తాయి!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 22.03.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి. బంధు మిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
వృషభ రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
మిథున రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల నుంచి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుంచి ఊహించని వార్తలు వినాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. రుణ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు.
కన్య రాశి ఫలాలు
ఆప్తుల నుంచి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ప్రముఖుల పరిచయాల వల్ల అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. పాత బాకీలు తీర్చగలుగుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
సోదరుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి ఫలాలు
ఇంటా బయటా ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు అంతగా కలిసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో మనస్పర్ధలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.
ధనుస్సు రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు అమలు చేయలేరు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉండవు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.
మకర రాశి ఫలాలు
బంధు మిత్రులని కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలని నిర్వహిస్తారు. ఇంటా బయటా మీ ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది.
కుంభ రాశి ఫలాలు
సోదరుల నుంచి ఊహించని చిక్కులు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మీన రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

