Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు రావాల్సిన డబ్బు టైంకి అందక ఇబ్బంది పడతారు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 22.02.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభ రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్థి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
మిథున రాశి ఫలాలు
అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని పనులలో తొందరపాటు ఇబ్బందికి గురిచేస్తుంది. కొన్ని వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
సింహ రాశి ఫలాలు
ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందక ఇబ్బంది పడతారు. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలంగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
ధనుస్సు రాశి ఫలాలు
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి.
మకర రాశి ఫలాలు
ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కుంభ రాశి ఫలాలు
దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయటా ఊహించని సమస్యలు ఉంటాయి. సంతాన ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
మీన రాశి ఫలాలు
ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

