Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 22.12.2025 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
భూ క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభ రాశి ఫలాలు
రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. పాత బాకీలు కొంత వరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
మిథున రాశి ఫలాలు
నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన విద్య విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటా బయటా సమస్యలు పెరుగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
సింహ రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది.
కన్య రాశి ఫలాలు
బంధు వర్గం నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
తుల రాశి ఫలాలు
రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. వ్యాపారాలలో ఊహించని నష్టాలు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమ ఫలించదు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
ఆస్తి వ్యవహారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి. తల్లితరపు బంధువుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
వివాదాలకు సంబంధించి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఓర్పుతో మీ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ పొందుతారు.
మకర రాశి ఫలాలు
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్థలు కలుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.
కుంభ రాశి ఫలాలు
ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రులతో సందడిగా గడుపుతారు.
మీన రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సన్నిహితుల నుంచి ఊహించని సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

