నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాటివ్వడం మంచిదికాదు!
Today Rasi Phalalu:ఈ రాశి ఫలాలు 21.10.2025 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
మిథున రాశి ఫలాలు
ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. అప్పుల ఒత్తిడి అధికమవుతుంది. ఇంటా బయటా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
కర్కాటక రాశి ఫలాలు
నూతన రుణ యత్నాలు అనుకూలించవు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది. కీలక సమయంలో సోదరుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
కన్య రాశి ఫలాలు
వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
తుల రాశి ఫలాలు
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు తప్పవు. వృథా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆలోచనలు కలిసిరావు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
ధనుస్సు రాశి ఫలాలు
ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది.
మకర రాశి ఫలాలు
ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందాతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు.
కుంభ రాశి ఫలాలు
నిరుద్యోగ యత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
మీన రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఉద్యోగులు ఒక వ్యవహారంలో అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.