కేతు సంచారం.. ఈ 4 రాశులవారు కష్టాల నుంచి బయటపడ్డట్లే- ఇక అన్నీ మంచి రోజులే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. త్వరలో కేతు సంచారం జరగనుంది. సాధారణంగా కేతు సంచారం అంటే చాలామంది భయపడిపోతారు. కానీ ఈ సంచారం కొన్ని రాశులవారికి విశేషమైన ఫలితాలు ఇవ్వనుంది. వారి జీవితంలో ఊహించని మార్పులు తీసుకురానుంది.

కేతు సంచారం
జ్యోతిష్య పండితుల ప్రకారం అక్టోబర్ 23న కేతువు సంచారం జరగనుంది. పూర్వఫల్గుణి నక్షత్రం మూడో పాదంలోకి కేతువు ప్రవేశిస్తాడు. ఇది శుక్రుడు అధిపతిగా ఉండే తుల రాశితో సంబంధం కలిగి ఉంటుంది. డిసెంబర్ 2 వరకు కేతువు ఈ పాదంలోనే సంచరిస్తాడు. కేతువు నక్షత్ర పాద మార్పు కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉంటుంది. ఇది వారికి అత్యంత అదృష్టవంతమైన కాలం అని చెప్పవచ్చు. మరి ఆ రాశులేంటో తెలుసుకుందామా..
కర్కాటక రాశి
కేతు సంచారం కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. కెరీర్‌లోని అడ్డంకులు తొలగిపోతాయి. అయితే చేసే పనిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కలిసివస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త పని ప్రారంభించడానికి ఇది శుభ సమయం.
కన్య రాశి
ఈ సమయంలో కన్య రాశి వారికి కేతువు ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక లాభాలు, విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగాల్లో సహోద్యోగులు, ఉన్నతాధికారులతో సమన్వయం కుదురుతుంది. మీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు అనుకున్న స్థాయిలో రాణిస్తాయి. బంధువులతో ఉన్న గొడవలు సర్దుమణుగుతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. ఇస్తే తిరిగి వసూలు చేసుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి కేతు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. వ్యాపారులకు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ లభించవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు.